మహబూబ్‌నగర్

కృష్ణా పుష్కరాలకు రూ.426 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 2: జిల్లాలో వచ్చే ఆగస్టు మాసంలో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.426కోట్ల నిదులను ఖర్చు చేయనుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు సంబందించిన అన్ని పనుల్లో నాణ్యత ఉండాలని, నాణ్యతకు తిలోదకాలు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానానికి తరలిరానున్నడంతో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అసౌకర్యాలకు గురికాకుండా చూసుకోవాలన్నారు. ఘాట్లు, రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, పారిశుద్ద్యం వంటి పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. నభూతోనభవిష్యత్ అనే రితీలో పుష్కరాలను నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. జడ్పి చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ పుష్కరాల విజయవంతానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పుష్కర ఘాట్ల వద్ద ఉండే దేవాలయాలతో పాటు జిల్లాలో ఉన్న మన్యంకొండ వంటి ముఖ్యమైన దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. పనుల్లో నాణ్యత తప్పకుండా ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సంపత్‌కుమార్, చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ పుష్కరఘాట్ల వద్ద మంచి నిఘా ఉంచాలని రద్దిని బట్టి ఆలోచనాలతో పని చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, శిక్షణ ఐఎఎస్ అధికారి గౌతమ్, డిఆర్‌ఓ భాస్కర్, జడ్పీ సిఇఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో
అందరూ భాగస్వాములు కావాలి
మిడ్జిల్, జూలై 2: బంగారు తెలంగాణలో ప్రజలందరు భాగస్వాములు కావాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శనివారం మిడ్జిల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఊరుకొండపేటలో రూ.10లక్షల విలువ చేసే సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. లింబ్యాతాండలో బస్ షెల్టర్‌ను ప్రారంబించారు. రాంరెడ్డిపల్లిలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఊరుకొండ గ్రామంలో నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించి అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. జకినాల పల్లి నుండి వెళ్లే రహదారిపై రూ.1.40కోట్లతో బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. వేముల గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయంలో భాగంగా రైతులకు 95 ఆవులు, 120 గొర్రెలు, 29 గెదేలను పంపిణీ చేశారు. అదేవిధగా ఈద్గాకు సంబందించిన పనులను ప్రారంభించారు. మండల సభలో హజరయ్యారు.