మహబూబ్‌నగర్

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 11: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. సోమవారం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి దత్తత గ్రామంలో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సంధర్భంగా సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ సమాజంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, దీన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. వృక్షాలు లేకపోవడం వల్ల వర్షాలు పడటం తగ్గుముఖం పట్టాయని, అందువల్ల భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయని వివరించారు. గత రెండేళ్ల నుండి సరైన వర్షాలు లేకపోవడం వల్లే ఈ ఏడాది త్రాగునీటికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అలాగే కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి చేపట్టిన పనులను పరిశీలించడంతో పాటు మున్ముందు ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టాలనే విషయాలపై గ్రామస్తులతో చర్చించారు.