మహబూబ్‌నగర్

ఏడాదిలోగా ఇంటింటికీ మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 13: ఏడాదిలోపు మీషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి మంచినీరు ఇవ్వడం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ మండల పరిధిలోని మన్యంకొండ గుట్టపై నిర్మిస్తున్న మిషన్ భగీరథ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెరాసలో చేరారు. మన్యంకొండ గుట్టపై నిర్మిస్తున్న మిషన్ భగీరథ రిజర్వాయర్ పనులను పరిశీలించి రిజర్వాయర్‌కు సంబందించిన మ్యాప్‌తో పాటు చుట్టూపక్కల గ్రామాలకు వెళ్లే పైపులైన్ల మ్యాప్‌ను కూడా పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వలసలకు నిలయం, నిరంతరం తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోంటున్న జిల్లా ప్రజలకు మరో ఏడాదిలోపు శాశ్వతంగా మంచినీటి పరిష్కారం కాబోతుందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో పాటు జూరాల బ్యాక్ వాటర్ నుండి మిషన్ భగీరథకు నీటిని తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే జిల్లాలో వందల కిలో మీటర్ల పైపులైన్లు ఆమర్చడం జరిగిందని పలు నియోజకవర్గాల్లో కోట్లాది రుపాయల వ్యయంతో మీషన్ భగీరథ రిజర్వాయర్లను కూడా నిర్మించడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి రూ.200కోట్లుతో మన్యంకొండ గుట్టపై రిజర్వాయర్ నిర్మాణం చేయడం జరుగుతుందని ఆ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించడమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామన్నారు. మన్యంకొండ రిజర్వాయర్ ద్వారా మంచినీటిని అందించినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సావిత్రి, జడ్పీటిసి శ్రీదేవి, వైస్ ఎంపిపి సరస్వతమ్మ, మాజీ జడ్పిటిసి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.