మహబూబ్‌నగర్

రోడ్డెక్కిన వట్టెం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వట్టెం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు గురువారం జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. తమ భూములను అధికారులు 123 జి ఓ ప్రకారంగా బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ తమ దగ్గర ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకుని ఇదే భూములు ఇచ్చినట్లు సమ్మతి పత్రాలంటూ తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ గ్రామాల ముంపుకు గురవుతున్న ప్రజలు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. టిటిడి కళ్యాణ మండపం సమీపంలో గల ధర్నా చౌక్‌కు చేరుకున్న ముంపు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు సిపి ఎంతో పాటు వివిధ ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులను బలవంతంగా భయపెట్టించి భూములు లాక్కోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. వట్టెం రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న పోతిరెడ్డిపల్లి, వెంకయపల్లి, కారుకొండ, అనకపల్లితాండ, కారుకొండతాండ, వట్టెం గ్రామస్ధులు వందలాది మంది ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దింతో పోలీసులు కలెక్టరేట్ వైపు వెళ్తున్న ముంపు బాధితులను అడ్డుకున్నారు. దింతో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. అయితే తమను అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో ముంపు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తమను సర్వనాశనం చేస్తుంటే పోలీసులు తమ గోడును వినాలని ప్రాదేయపడ్డారు. తమతో బలవంతంగా 123 జిఓ ప్రకారంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వాటిని తమకు తిరిగి పోలీసులు ఇప్పిస్తారా అని కొందరు మహిళలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. కాగా పోలీసులు మాత్రం ర్యాలీకి అనుమతి లేదని తెల్చి చెప్పడంతో బాధితులు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ఓ పక్క ప్రభుత్వం తమను ముంచేస్తుంటే మరోపక్క పోలీసులు తమను కలెక్టర్‌ను కలవకుండా అడ్డుకోవడం ఏమిటని తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని పోలీసులపై మహిళలు శాపనార్థలు పెట్టారు. నిర్వాసితులు వినకపోవడంతో తప్పనిపరిస్థితుల్లో పోలీసులు నిర్వాసితుల్లో ఐదుగురిని కలెక్టర్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. అనంతరం డిఆర్‌ఓ భాస్కర్‌కు భాదితులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులు డిఆర్‌ఓ భాస్కర్‌కు అందించిన వినతిపత్రంలో తమ భూములను అధికారులు బలవంతంగా లాకుంటున్నారని మా నుండి ధర నిర్ణయించకుండా ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకుంటున్నారని పెర్కోన్నారు. ఇప్పటికే చాలా మంది దగ్గర అధికారులు అలాంటి సమ్మతి పత్రాలను తీసుకున్నారని వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టంపై తమకు అవగాహన కల్పించి ఆ తర్వాత ఈ చట్టం ప్రకారంగానే తమకు పరిహారం వచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమలు చేస్తున్న 123 జిఓ ప్రకారంగా భూసేకరణను నిలిపివేయాలని అధికారులు బలవంతంగా చేస్తే తాము భూములను ఇవ్వబోమని ఎంతటికైన తెగిస్తామని డిఆర్‌ఓ ముందు తెల్చి చెప్పారు. గ్రామపంచాయతీలో సభ ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో నిర్మించబోతున్న కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితులు రోడ్డుపైకి రావడం భూములు ఇవ్వబోమని తెల్చి చెప్పడం ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుండడం పరిస్థితులు ఎటు వెళ్తాయోనని జోరుగా చర్చ జరుగుతుంది