మహబూబ్‌నగర్

ప్రాజెక్టులను అడ్డుకున్న వారిని రైతులే తరిమికొడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూలై 14: పాలమూరు జిల్లాలో దేశనాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారని, అభివృద్ద్ధిలో ఆటంకాలు కల్పిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రాజెక్టులను అడ్డుకున్నవారిని రైతులే తిరగబడి తరిమికొడతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట, కానాయిపల్లిలో గురుకుల పాఠశాలను ప్రారంభించి మాట్లాడారు. కెసిఆర్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి జిల్లాలోని నాలుగు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి మొదటివడత 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, వచ్చే యేడాది మరో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. కొందరు నాయకులు రైతులను అయోమయానికి గురిచేస్తూ 123 జిఓ, 2013 జిఓ ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారని, గత ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చారో రైతులకు చెప్పాలన్నారు. ప్రజా ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టాలని, రాష్ట్రంలో 46 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలన్నారు. మొక్కలను నాటిన అనంతరం వాటిని పరిరక్షించే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, జిల్లాలో 16 శాతం మాత్రమే అటవీ ఫ్రాంతం ఉందని, అడవులు లేకపోవడంవల్ల కరువు కాటకాలు సంబవిస్తున్నాయన్నారు. అంతకుముందు ఎమ్మెల్యె ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్య్రం వచ్చి 60 ఏండ్లు అయినా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 200 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, తెలంగాణ వచ్చాక 310 గురుకుల పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలో బూత్‌పూర్, దేవర్‌కద్రకు 2 గురుకుల పాఠశాలలు మంజూరసతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ ఎజాజ్ అహ్మద్, ఇడి అమీద్, ఆర్డీఓ రాంచందర్, ఎంపిపిలు గుంత వౌనిక, గోపాల్, నాయకులు చెన్నకేశవరెడ్డి, భీంరెడ్డి, కొండారెడ్డి, ప్రశాంత్, లతీఫ్, కృష్ణయ్య, బాబు రెడ్డి పాల్గొన్నారు.