మహబూబ్‌నగర్

మైనింగ్ ఎడిఎ, రాయల్టీ ఇన్స్‌స్పెక్టర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: జిల్లాలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు నిబ్బంధనాల ప్రకారం అనుమతిస్తే నిబంధనాలను తుంగలో తొక్కి ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు మైనింగ్ అధికారులను గురువారం రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. మంత్రి కెటి ఆర్ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ శివారులో గల వాగులో 1950 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే అధికారులు నిబంధనాలకు విరుద్దంగా 6000 క్యూబిక్ మీటర్లకు అనుమతులిచ్చి ఇసుకను తవ్వడంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలింది. దింతో మైనింగ్ ఏడి కృష్ణా ప్రతాప్, రాయల్టీ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్‌లను సస్పెండ్ చేశారు. దింతో ఒక్కసారిగా జిల్లాలో అధికారుల గుండెల్లో రైలు పరుగెత్తాయి. అంతేకాకుండా ఇసుక మాఫియాలో కూడా వనుకు మొదలైందని చెప్పవచ్చు.