మహబూబ్‌నగర్

వచ్చే ఖరీఫ్ నాటికి 8లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 21: తెలంగాణ ఉద్యమం సందర్భంగా కెసి ఆర్ చెప్పిన మాటలు నిజమై కృష్ణానీటిపై తొలి ఫలితం పాలమూరుకే దక్కిందని, కృష్ణాజలాలపై మొదటిహక్కు పాలమూరు జిల్లాదేనని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం ధరూరు మండలంలోని ర్యాలంపాడు గ్రామం వద్ద జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండవ దశకు సంబంధించిన ఫైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పంప్‌హౌస్‌లో పంపులు ఆన్‌చేసి ట్రయల్న్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీష్‌రావు మాట్లాడుతూ కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల అయినందున జూరాల ద్వారా నెట్టెంపాడుకు వరద నీటితో రిజర్వాయర్లను నింపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్‌లో 4లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, వచ్చే సంవత్సరం ఖరీఫ్ నాటికి 8లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పుష్కరుడు సమీపిస్తున్న సందర్భంలో పాలమూరు బీడు భూముల్లో కృష్ణానీరు ఉరకలెత్తడం శుభసూచకమన్నారు.
తెలంగాణ వస్తేనే మా గోస తీరుతుందని ఆశించిన ప్రజలకు రెండు సంవత్సరాల్లోనే రూ.2,300 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు పదేళ్లు పాలన చేసినా మూడెకరాలకు కూడ సాగునీరు అందివ్వలేదన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనుల శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి త్వరలో ఇక్కడికి రానున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణాజలాల ట్రిబునల్ ద్వారా నీటివాటాను సాధించి జిల్లాను హరితపాలమూరుగా చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల కోరిక మేరకు గుర్రంగడ్డ వద్ద వంతెన ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, త్వరలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, జెసి రాంకిషన్, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ఇరిగేషన్ అధికారులు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, నేతలు కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, గట్టు తిమ్మప్ప, చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి ఉన్నారు.
ప్రతిపక్షాల బురద రాజకీయాలను
పట్టించుకోం
కృష్ణా, తుంగభద్ర జీవనదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతం తాగు, సాగునీటికి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికి ఈ ప్రాంత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కేవలం అభివృద్ధి చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వంపై బురదచల్లే రాజకీయాలు చేయడం తప్పా అభివృద్ధిపై ధ్యాసలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.
రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోగా ఇక్కడి నేతలు వౌనంగా ఉండడంతో ఆంధ్ర ప్రాజెక్టులు పూర్తయి సాగునీరు అందుతున్నప్పటికి ఇక్కడి భూములు బీడు భూములుగానే ఉన్నాయన్నారు. పాలమూరు జిల్లాలో పసిడిపంటలు వృద్ధ్ది చెంది ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.