మహబూబ్‌నగర్

భీమా టన్నల్ నుండి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూలై 21: భీమా టన్నల్-2 లిఫ్ట్-2 నుండి గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా లిఫ్ట్ ద్వారా 46వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కొత్తకోట, పెబ్బేరు, కొల్లాపూర్, పెద్దమందడి మండలాలకు ఈ సాగునీరు అందుతుందని వారు తెలిపారు. అనంతరం భీమా లిఫ్ట్ వద్ద శిలఫలకాన్ని ప్రారంభించి స్వీచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. పంప్‌హౌస్‌ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, చిన్నారెడ్డి, నాయకులు శివకుమార్ రెడ్డి, శివకుమార్, ఎంపిపి గుంత వౌనిక, సర్పంచు చెన్నకేశవ రెడ్డి, రావుల సురేంద్రనాథ్ రెడ్డి, భీంరెడ్డి, కొండారెడ్డి, ప్రశాంత్, జగన్, మిషేక్, కటికె శ్రీను, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.