మహబూబ్‌నగర్

46 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, జూలై 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 316 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం బాలానగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో అభివృద్ద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మారెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ గ్రామ సమీపంలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2.45కోట్లతో డార్మెటరీ అండ్ డైనింగ్ హాల్ నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిరుపేద పిల్లలు చదువుకోవాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 316రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్దమైందని, జడ్చర్ల నియోజకవర్గంలో నాలుగు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిరుపేద విద్యార్థులందరు చదువుకునేందుకు వీలుగా కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించలేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హరితహారం కార్యక్రమమని అన్నారు. రాష్ట్రంలో 24శాతం ఉన్న అడవులను ఈ సంవత్సరం హరితహారంలో మొక్కలు నాటి 34శాతానికి పెంచనున్నట్లు పేర్కొన్నారు. 2016వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46కోట్ల మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. పాలమూరు జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉందని, కాబట్టి జిల్లాలో 5.40కోట్ల మొక్కలను నాటి ఆటవీ ప్రాంతాన్ని విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని ప్రజలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడు అదనపు గదులను కోటి రూపాయలతో నిర్మించేందుకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి భాగ్యమ్మ, వైస్ ఎంపిపి లింగునాయక్, మాజీ ఎంపిపి నర్సింలుయాదవ్, నాయకులు వెంకటచారి, శ్రీనివాసరావు, భూపాల్, బాలయ్య, ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకటేష్‌ప్రసాద్ పాల్గొన్నారు.