మహబూబ్‌నగర్

అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, జూలై 31: నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పది రోజుల పాదయాత్రకు ప్రతి గ్రామంలో పార్టీలకు అతీయితంగా బ్రహ్మరధం పడుతున్నారని జిఓ 69 అమలు చేసే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాలను కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు ఆదివారం మండలంలోని మాతామాణికేశ్వరీ ఆశ్రమంలో అఖిలపక్షం నాయకులతో కలిసి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి, మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్దాలు ప్రజలకు చేబుతూ కాలయాపన చేయడం జరుగుతుందన్నారు. పాదయాత్రలతో ప్రజల్లో ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. నారాయణపేట - కొడంగల్ పథకానికి నికర జలాలతో సాగునీరు అందిచే విధంగా ఉందన్నారు. పధకానికి జిఓ 69 ఇవ్వడం జరిగిందని రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొంది నిధుల మంజూరీ జరిగిన తరువాత దానిని వదిలిపెట్టి పాలమూరు ఎత్తిపోతలతో సాగు నీరు అందిస్తామని చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 ద్వారా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తలకో మాట మాట్లాడి నిర్వాసితులకు అన్యాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతుందన్నారు.
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్షి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ 46 టిఎంసిల నీళ్లను జూరాల ద్వారా నికర జలాలను వాడుకోవాల్సి ఉండగా ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీరు వస్తుందంటే ఎవ్వరు నమ్మరని అన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు నాగూరావునామాజీ మాట్లాడుతూ పాదయాత్రలతోనే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని జిఓ 69 అమలు చేసేవరకు పోరాటం ఆగదన్నారు. నారాయణపేట కాంగ్రెస్ ఇంచార్జి సరాఫ్ కృష్ణ మాట్లాడుతూ నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రజలకు ప్రతి విషయం అర్థం చేసుకుని ప్రభుత్వం తమ ప్రాంతాన్ని నిర్లక్షం చేస్తుందని గమనించడం జరుగుతుందన్నారు. జూరాలను వదిలి శ్రీశైలం నుండి నీటి కోసం వేళ్లడం మంచిపద్దతి కాదన్నారు. పార్టీలకు అతీతంతా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు అఖిల పక్షం నాయకులు అనంత్‌రెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌గౌడ్, న్యూడెమక్రసీ నేతలు పాల్గొన్నారు.