మహబూబ్‌నగర్

గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 28: గుప్తనిధుల తవ్వకాల ముఠాను ఆరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ గుప్తనిధుల కోసం చట్ట వ్యతిరేక దీక్షలో దొంగతనాలు చేస్తూ దేవాలయాల్లోని విగ్రహాలను చోరి చేసిన ఏడుగురు ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. గత నెల 25వ తేదిన హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలో గల నందిశ్వరుడి గుడిలో ఉన్న పురాతన నంది విగ్రహాన్ని ఏడుగురు ముఠా సభ్యులు అపహరించుకుపోయారని వెల్లడించారు. నంది విగ్రహంలో వజ్రలు ఉన్నట్లు భావించిన ఏడుగురు నింధితులు దొంగిలించిన విగ్రహాన్ని పగులగొట్టారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల కృష్ణయ్య, మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం మదిగట్ల గ్రామానికి చెందిన బెజ్జు రాఘవేందర్, కొందుర్గు మండలం గాలిగూడెం గ్రామానికి చెందిన ముద్దంగుల అనిల్, ఇదే గ్రామానికి చెందిన ఈస యాదయ్య, పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన గుడిసె రంజిత్, కోడేరు మండలం జనుంపల్లి గ్రామానికి చెందిన పుల్ల నాగరాజు, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌కు చెందిన సాకే వెంకటరమణలు గొండ్యాల గ్రామంలోని నందిశ్వరుడి దేవాలయంలో ఫిబ్రవరి 25వ తేదిన అర్థరాత్రి ఒంటిన్నర ప్రాంతంలో గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి గడ్డపార సహయంతో గుడిలోని నంది విగ్రహాన్ని వెలికి తీశారన్నారు. విగ్రహం బరువు అధికంగా ఉండడంతో తాడు బిగించి బోలెరో వాహనం వెనుక తాడుతో కట్టి మునిమోక్షం గేటు వరకు లాక్కొని వచ్చారని తెలిపారు. అక్కడ ఎవరు లేకపోవడంతో విగ్రహాన్ని వాహనంలోకి వేసుకుని రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్ మీదుగా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ మీదుగా అక్కమ్మ చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నంది విగ్రహాన్ని ముక్కలు చేసి చూడగా అందులో ఎలాంటి వజ్రలు లేకపోవడంతో విగ్రహపు ముక్కలను పక్కనే ఉన్న చెరువులో వేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ నెల 27వ తేదిన మధ్యాహ్నం వాహనాల తనిఖీలో భాగంగా చిన్నదర్పల్లి గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బోలెరో వాహనంలో వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గొండ్యాల నందిశ్వరుడి దేవాలయంలో నంది విగ్రహాన్ని చోరి చేసిన నింధితులుగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితులు తెలిపిన సమాచారం మేరకు నంది విగ్రహాన్ని పగులగొట్టిన ముజాహిద్‌పూర్ చెరువు దగ్గరకు వెళ్లి చూడగా మూడు గడ్డపారలు, రెండు పెద్ద సుత్తేలు, రెండు ఉల్లి చెనె్నలు, నంది విగ్రహానికి సంబందించిన పగులగొట్టిన ముక్కలు లభ్యమయ్యాయని తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ పోలీసులు కేసును చెదించి దొంగలను ఆరెస్టు చేయడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ దొంగల్లో సాకే వెంకటరమణ మహబూబ్‌నగర్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పట్టుకున్న నింధితులను కోర్టులో హజరుపరుస్తామని ఎస్పీ తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ కృష్ణమూర్తి, హన్వాడ, రూరల్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.