మహబూబ్‌నగర్

ప్రభుత్వ ఉద్యోగాల్లో కరాటే మాస్టర్లకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 7: వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాల్లో కరాటే మాస్టర్లకు 2శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించాలని కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం టి ఎన్ జి ఓ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది శిక్షణ పొందిన కరాటే మాస్టర్లు నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని రకాల క్రీడలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికిని కరాటేకు ప్రాధాన్యత ఇవ్వనందునే ఇలాంటి పరిస్ధితి నెలకొందన్నారు. క్రీడాకారుల మాదిరిగా కరాటేకు అవకాశం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్ ఎంపికలో కరాటే వారికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ డిజిపి, ఎస్పీలకు లేఖలు రాశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కరాటే మాస్టర్లు యశోద, స్నేహలత, భువనేశ్వరి, కార్యదర్శి రమేష్ రాథోడ్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.