మహబూబ్‌నగర్

గొందిమల్లఘాట్‌లో కెసిఆర్ పుష్కర స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, ఆగస్టు 9: ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కృష్ణాపుష్కరాల పనులను గొందిమల్లఘాట్‌లో మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్‌లు పరిశీలించారు. కృష్ణానదిలో నీటి మట్టాన్ని, ఘాట్ పనులను, పార్కింగ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గొందిమల్ల ఘాట్‌లో కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జోగుళాంబ సన్నిదిలో కృష్ణ పుష్కరాలు రావడం శక్తిపీఠం కాబట్టి ప్రాముఖ్యతను తెలిపేలా చూడాలన్నారు. తెలంగాణలో శక్తిపీఠం ఉండడం మన అదృష్టమని ఆయన అన్నారు. కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ జనవరిలోనే మంత్రులతో, జిల్లా కలెక్టర్‌తో సమావేశం చేపట్టి ప్రణాళికను ఏర్పాటు చేశారన్నారు. గొందిమల్లఘాట్ వద్ద గంట గంటకు నీరు ఉదృతంగా పెరుగుతుందని, స్నానాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు. 1.90లక్షల క్యూసెక్కుల నీరు అలవెన్స్ ఉన్నదని, నీటి మట్టం పెరిగితే ఘాట్‌కు ప్రమాదం ఉంటుందని దీనివల్ల హై లెవల్‌ఘాట్‌ను కూడ ఏర్పాటు చేశారన్నారు. నాగార్జునసాగర్‌కు నీళ్లు వదిలేలా చర్యలు జరుగుతున్నాయని అన్నారు. కృష్ణాపుష్కరాలకు సంబంధించి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు రూ.825 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు, 81 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం చిన్నచిన్న పనులు ఉన్నాయని బుధవారం నాటికి పనులు పూర్తవుతాయని, రెండు నెలల నుంచి అధికార యంత్రాంగం కష్టపడుతుందన్నారు. కృష్ణపుష్కరాలకు సంబంధించి 23వేల మంది పోలీసులు, శానిటరి, వాలంటీర్లు తదితరులను నియమించినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాలను చేశామన్నారు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు, పిండ ప్రధానాలకు అర్చకులను ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలకు సంబంధించి 3కోట్ల మంది మంది పుష్కరస్నానాలు చేస్తారని అనుకున్నామని, ఇంటలిజెన్స్ రిపోర్ట్ ద్వారా నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరస్నానం చేసి పుణ్యం తెచ్చుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్టమొదటి కృష్ణపుష్కరాలు వచ్చాయని, వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని తెలిపారు. వారి వెంట జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, అడిషనల్ జెసి రంజిత్‌ప్రసాద్, జడ్పిసిఇఓ లక్ష్మినారాయణ, ఎండోమెంట్ కమీషనర్ శివశంకర్ తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రులు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.