మహబూబ్‌నగర్

నరుూంకు షాద్‌నగర్‌లో సహకరించిందెవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 9: షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ మహ్మద్ నరుూం మృతి చెందడంతో మంగళవారం ఆయన శవాన్ని షాద్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు పోలీసులు అప్పగించారు. అయితే నరుూంను తుదముట్టించిన పోలీసులు ఇక ఆయన స్థాపించుకున్న సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉన్నాయోనని పోలీసులు మూలాలను వెతుకున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో నరుూంకు కొందరు రౌడీషీటర్లు దగ్గరైనట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకోణంలో సైతం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా షాద్‌నగర్‌లో గత ఏడాదిపాటుగా సెటిల్‌మెంట్లు, దందాలు ఇక్కడి నుండే చేసిన నరుూంకు తప్పకుండా ఇక్కడ మూలాలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా షాద్‌నగర్‌లోని ఒకరిద్దరు రౌడీ షీటర్లు నరుూం దందాలో కొంతైన భాగస్వామ్యం ఉండోచ్చనే భావంతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా నరుూం ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు గతంలోనే స్పష్టం కావడంతో ఇక్కడ కూడా నరుూం కొందరిని ఉగ్రవాద సంస్థలకు లింక్ చేయవచ్చనే కోణంలో సైతం పోలీస్ యంత్రాంగం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికి నరుూంను హతమార్చి దాదాపు 36గంటలు దాటినప్పటికి ఇంకా షాద్‌నగర్‌లోని పలు ఇళ్లల్లో పోలీసులు రహాస్యంగా అనుమానం వ్యక్తమవుతున్నట్టువంటి కొందరి ఇళ్లల్లో సోదాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా షాద్‌నగర్ పట్టణంలోని ఒకరిద్దరు రౌడీషీటర్లు గత ఏడాది నుండి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారనే దిశలో వారు ఎక్కడెక్కడ తిరిగారో అనే వాటిపై కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. ఒకరిద్దరు మహిళలు కూడా ఈప్రాంతానికి చెందినవారు నరుూంతో లోకల్ రౌడీషీటర్లు పరిచయం కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాల అనుమానం. నరుూం మృతి చెందిన తరువాత సైతం పోలీసుల ఆపరేషన్ ఆయన ముఠాపై పడ్డట్లు తెలుస్తుంది. నరుూంను హతమార్చిన పోలీసులు అదుపులో ఉన్న వారిని లోతుగా విచారిస్తున్నటు విశ్వసనీయ సమాచారం. అసలు నరుూం మిలీనియం టౌన్‌షిప్‌కు గత రెండు నెలల నుండి దాదాపు 10నుండి 15సార్లు వచ్చిపోయినట్లు పోలీస్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాషా అనే వ్యక్తి ఇక్కడి వారికి గుంటూరు వాసిగా పరిచయం చేసుకున్నప్పటికి తాను కొనుగోలు చేసిన ఇంటి దస్తావేజుల్లో మాత్రం మిర్యాలగూడకు చెందిన బాషాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికి నరుూం దందాలు షాద్‌నగర్‌తోపాటు చుట్టు పక్కల గ్రామాలలో కొన్ని భూదందాలు చేసినట్లు, అందులో ప్రధానంగా షాద్‌నగర్‌కు చెందిన ఒకరిద్దరు రౌడీషీటర్లు సహకరించారనే కోణంలో సైతం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెల్దండ మండలంలో కూడా ఓ కేసు విషయంలో నరుూం రాజీ కావాలని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆరా తీస్తున్నారు. నరుూం ఖేల్ ఖతం కావడంలో ఇక ఆయన ముఠా సభ్యులను ఎక్కడికక్కడ కట్టడి చేసి నరుూం సాంమ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మాత్రం గట్టీ చర్యలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.