మహబూబ్‌నగర్

90శాతం పుష్కరఘాట్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తుందని సమయం దగ్గర పడడంతో ఇప్పటి వరకే అన్ని పుష్కరఘాట్లు 90శాతం పనులు పూర్తిచేయడం జరిగిందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. మంగళవారం పుష్కరఘాట్ల పర్యవేక్షణలో బాగంగా ఇటిక్యాల మండల పరిధిలోని బీచుపల్లి 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పుష్కరఘాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 52 నూతన పుష్కరఘాట్లను పుష్కరఘాట్లను ఏర్పాటు చేసి భక్తులకు వౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. మిగిలిన పుష్కరఘాట్ పనులు బుధవారం రాత్రి సమయానికల్లా పూర్తి చేసి పరిశుభ్రంగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా 7వేల మంది పోలీసులతో జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిసి కెమెరాలు, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ టీంలు ఏర్పాటు చేసి పుష్కరభక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. పుష్కరఘాట్లలో భక్తులు స్నానం చేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఇతరులకు అవకాశం కల్పించే విధంగా స్నేహపూరితంగా ఒకరికొకరు అర్థం చేసుకొని మెలగాలన్నారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా దైవానుగ్రహంతో నది నిండుగా పారుతుందని, జిల్లాలోని అన్ని పుష్కరఘాట్లకు నీరు చేరడం సంతోషయాదకమన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రతినిత్యం పనులను పర్యవేక్షిస్తూ ఘాట్ల పూర్తికి శాయశక్తులా కృషి చేశారని వారు కొనియాడారు. మంత్రుల వెంట జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కృష్ణ పుష్కరఘాట్ ప్రత్యేక అధికారి గంగిరెడ్డి, ఇటిక్యాల జడ్పిటిసి ఖగ్‌నాథ్‌రెడ్డి, గద్వాల డిఎస్‌పి బాలకోటి, తహశీల్దార్లు ముణెప్ప, సుబ్రమణ్యం, సంబంధితశాఖల అధికారులు ఉన్నారు.