మహబూబ్‌నగర్

దేశచరిత్రలోనే తొలిసారి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 12: రాష్ట్రంలో జరుగుతున్న పనె్నండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకంగా ఆరు స్థానాల్లో ఏకగ్రీవం కావడం దేశచరిత్రలోనే తొలిసారి అని టిఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత ఎంపి జితెందర్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతలక్ష్మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి జితెందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏకగ్రీవంగా కావడం గొప్ప విషయమన్నారు. అదే తరహాలో మహబూబ్‌నగర్‌లో కూడా జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన ఇద్దరు అభ్యర్థులు జగధీశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డిలను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. పాలమూరు జిల్లాను వెనుకబాటుకు గురి చేసిన కాంగ్రెస్, టిడిపి నాయకులను ఓడించాలని వారికి ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తాము ఈ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను సునాయసంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దుబాయ్‌కి సంబంధించిన ఇంతియాజ్ కంపెనీతో పాటు ఆర్ సార్ కలాం కంపెనీలు వస్తున్నాయని, చెన్నై నుండి లేదర్ కంపెనీ కూడా మహబూబ్‌నగర్‌లో స్థాపించడానికి ఆ సంస్థ నిర్ణయం తీసుకుందని అన్నారు. 14 పరిశ్రమలు తెలంగాణకు వస్తే అందులో 9 పరిశ్రమలు మహబూబ్‌నగర్‌లోనే ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి కెసి ఆర్‌కు బహుమతిగా ఇస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను తప్పకుండా గెలుస్తామని ఇప్పటికే ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడం దేశంలో, ఏ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జగధీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమకు పూర్తి మేజార్టీ ఉందని కాంగ్రెస్ నాయకులు సంఖ్యాబలంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మైండ్ గేమ్ ఆడుతున్నది కాంగ్రెస్ వారని, మైండ్‌తో అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు. మరొ నాలుగైదు రోజుల్లో చాలా మంది ఎంపిటిసిలు, జడ్పిటిసిలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బెక్కం జనార్థన్, రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, సురేందర్‌రెడ్డి, బెనహర్, సాయిరెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.