నల్గొండ

నదీ అగ్రహారానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 19: పుష్కరాలలో భాగంగా 8వ రోజు శుక్రవారం గద్వాల పట్టణ సమీపంలోని నదీ అగ్రహారానికి జిల్లా నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర పుష్కర స్నానం ఆచరించడంతో పరమపాపాలు తొలగిపోతాయని భావించి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి భక్తులు పుష్కర ఘాట్లకు తరలివస్తుండడంతో భక్తులతో కృష్ణానది తీర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నారు. నదిఅగ్రహారం వద్ద శుక్రవారం దాదాపు 30 వేలకు పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఐదు పుష్కర ఘాట్లలో భక్తులు కిక్కిరిసిపోవడంతో కొంత సేపు ఇతర భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అన్ని శాఖల అధికారులు ఒక పక్క విధులు నిర్వహిస్తున్నప్పటికీ స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు, విద్యార్థుల, వలంటీర్ల సేవలు పుష్కర ఘాట్ల వద్ద మరువలేనివని భక్తులు కొనియాడారు. ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు మందకొడిగా ఉన్న భక్తులు..ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తజనంతో ఘాట్లన్నీ రద్దీగా కన్పించాయి.
మహా హారతిలో పాల్గొన్న మంత్రులు
పెబ్బేరు: రంగాపూర్ ఘాట్‌లో మహా మంగళ హారతికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. శుక్రవారం కృష్ణవేణి మాతకు సంధ్యవేళ మహా మంగళ హారతి వేదపండితుల మధ్య గంగకు హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. కృష్ణవేణి మాతకు చీర, పసుపు, కుంకుమ్మ సమర్పించారు. కార్యక్రమంలో ఎజెసి బాలాజీ రంజీత్ ప్రసాద్, పిడి దామోదర్ రెడ్డి, ఆర్డీఓ రాంచందర్, డిఎస్పీ జోగుల చెన్నయ్య, సి ఐ ధనలక్ష్మి, ఎస్‌ఐలు ఓ.డి రమేష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, తహశీల్ధార్ దత్తాత్రి, విఆర్‌ఓలు, ప్రజలు మహా మంగళ హారతిలో పాల్గొన్నారు.
మునగమాన్‌దినె్న ఘాట్‌కు విఐపిల తాకిడి
పెద్దమందడి: కృష్ణా పుష్కరాల్లో భాగంగా శుక్రవారం 8వ రోజు పలువురు వి ఐపిలు మునగమాన్‌దినె్న పుష్కర ఘాట్‌లో స్నానం ఆచారించారు. స్నానం
ఆచారించిన వారిలో అనంతపూర్ జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ఆర్ సిపి నాయకులు కేపిరెడ్డి వెంకట్ రాంరెడ్డి, వరంగల్ జిల్లా సివిల్ సప్లైయ్ జాయింట్ డైరెక్టర్ ఎన్. ఎస్. నర్సింహ్మ మూర్తి, మెదక్ మాజీ జడ్పీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, దక్షిణ మధ్య రైల్వే మెకానికల్ కమిషనర్ నాగేశ్వర్ రావులు పుష్కర ఘాట్‌లో కుటుంబ సమేతంగా స్నానం ఆచారించారు. వారి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి, కృష్ణమ్మకు హారతులు ఇచ్చారు.