మహబూబ్‌నగర్

అశేష భక్తవాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 19: కృష్ణమ్మ పులకించింది. ఘాట్లన్ని జనకళగా మారాయి. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎనిమిదవరోజు శుక్రవారం జిల్లాలోని తంగిడి, కృష్ణ, పస్పుల, ముడుమాల్, నది అగ్రహారం, పెద్దచింతరేవుల, మూలమళ్ల, బీచుపల్లి, రంగాపూర్, జోగులాంబ (గొందిమళ్ల), జటప్రోలు, సోమశిల, పాతాళగంగా పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా పుష్కరాలు నాలుగు రోజుల వ్యవధిలో ముగియనున్నడంతో భక్తుల రద్ది ఒక్కసారిగా పెరిగిపోయింది. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐజి శ్రీనివాస్‌రెడ్డి, డిఐజి అకున్‌సబర్వాల్, ఎస్పీ రెమా రాజేశ్వరిలు భద్రతపై ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు వరదలా తరలివస్తుండడం కృష్ణా తీరమంతా జనసంద్రంగా మారింది. స్నానాలు ఆచరించడానికే భక్తులు అరకిలో మీటర్ దూరం క్యూలో లైన్‌లో వచ్చి పుణ్యస్నానం చేసే పరిస్థితి ఏర్పడింది. దినిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన అధికారులు అధిక సంఖ్యలో వచ్చే భక్తులను ఇతర ఘాట్లకు మళ్లించారు. రంగాపూర్ ఘాట్‌కు సాధారణ భక్తులతో పాటు విఐపిల తాకిడి కూడా ఎక్కువ అయ్యింది. శుక్రవారం జిల్లాలో రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారులు పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా జోగులాంబ పుష్కర ఘాట్‌కు లక్షలాది మంది తరలిరావడంతో గొందిమళ్ల ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ముఖ్యంగా జోగులాంబ పుష్కర ఘాట్‌కు కృష్ణమ్మ అలలు ఎగిసిపడ్డాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ జోగులాంబ పుష్కర ఘాట్లను ముంచేత్తింది. దింతో ముఖ్యమంత్రి కెసిఆర్ పుణ్యస్నానం ఆచరించిన గొందిమళ్ల పుష్కర ఘాట్ కృష్ణా జలాలతో నిండుకుండలా మారింది. ఇది ఇలా ఉంటే పుష్కర ఘాట్ నిండిపోవడంతో భక్తులు ఘాట్‌కు ఇటు అటువైపులా నదిలోకి వెళ్లి పుణ్యస్నానాలు చేస్తుండడంతో పోలీసు యంత్రాంగం భక్తులు నదిలోకి దూరంగా వెళ్లకుండా రోప్ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అప్రమత్తం చేసి ఎన్‌ఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా జోగులాంబ ఘాట్‌లోని నదిలో నిరంతరంగా నిఘా ఉంచారు. భక్తులు నదిలోపలికి దూరంగా రాకుండా చర్యలు తీసుకున్నారు. ఘాట్ దగ్గర రద్దితో పాటు ఐదవశక్తిపీఠం జోగులాంబదేవి ఆలయం జనసంద్రంగా మారింది. శతచండీయాగం రెండవరోజు భక్తిశ్రద్దలతో కొనసాగింది. మంత్రులు నాయిని నరసింహరెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డితో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడ పుణ్యస్నానాలు చేసి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. సోమశిలలో కూడా భక్తుల రద్ది కొనసాగింది. టిజె ఎసి చైర్మన్ కొదండరాంతో పాటు మంత్రి జూపల్లి, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డితో పాటు పలువురు పుణ్యస్నానాలు ఆచరించారు. ఏది ఎమైనప్పటికిని కృష్ణానది తీరానికి అశేష భక్తజనవాహిణి తరలిరావడంతో పుష్కర ఘాట్లు భక్తులతో జనకళగా మారాయి. బీచుపల్లి ఘాట్ దగ్గర మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు హరతీ ఇవ్వగా, నది అగ్రహారంలో ఎమ్మెల్యే డికె అరుణతో కలిసి కలెక్టర్ టికె శ్రీదేవి కృష్ణమ్మకు హరతీ ఇచ్చారు.