మహబూబ్‌నగర్

రెండవ రోజుకు చేరిన అఖిలపక్షం రిలే దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఆగస్టు 25: కల్వకుర్తి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు గురువారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ రిలేదీక్షలో తెలుగుదేశం పార్టీ తాలుకా అధ్యక్షుడు బాలస్వామిగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ డిసిసి అధికార ప్రతినిధి గంగాధర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పురుషోత్తం, సింగిల్‌విండో వైస్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి, టిడిపి నాయకులు బ్రహ్మం, రహీమ్, బిజెపి నాయకులు అభిలాష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డిలు రెండవ రోజు రిలే దీక్షలో కూర్చుకున్నారు. స్థానిక తహాశీల్దార్ కార్యాలయం జెఎసి శిబిరం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే యడ్మకిష్టారెడ్డి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని వసతులు,వౌళిక సదుపాయాలున్నాయని కల్వకుర్తి ప్రజల మనోభావాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షలో బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వివిధ విద్యార్థి, రైతు సంఘాల నాయకులు దుర్గ ప్రసాద్, రాంరెడ్డి,శ్రీరాములు, షాకీర్, రాఘవేందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.