మహబూబ్‌నగర్

రైతులపై కనికరం చూపని కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఆగస్టు 26: వరుసగా మూడేళ్లుగా కరవుతో రైతులు అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహాలోకంలో పయనిస్తూ రైతులను మాయమాటలతో మభ్య పెడుతున్నారేగాని, రైతులపై ఏమాత్రం కనికరం చూపడంలేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజి మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ వరసగా కరవుతో రైతులు అల్లాడిపోతున్నారని, గతేడాది కరవు ప్రాంతాలను ప్రకటించిన ప్రభుత్వం నేటికి కరవుసహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి ఇన్‌ఫుట్ ఘసబ్సిడీ డబ్బులు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు మల్లించిందని విమర్శించారు. గతేడాది తీవ్రమైన కరవుతో అల్లాడిపోయిన రైతులు ఈయేడాది ప్రారంభంలో మంచి వానలు పడటంతో రైతులు వివిధ పంటలను వేసుకున్నారని, ప్రభుత్వం సూచించిన విధంగా చాలా మంది పత్తిపంటకు బదులుగా మొక్కజొన్నపంటను వేసుకున్నారని, కాని వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్నపంటకు వందశాతం నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతుల కాళ్లు కడుగుతానని చెబుతున్న సిఎం కేసిఆర్ కాళ్లు కడగనవసరం లేదని, వారి కన్నీళ్లు తూడిస్తే చాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను మహారాష్టక్రు తాకట్టుపెట్టి మహా ఒప్పందం చేసుకొని, ఏదో సాధించినట్లు పెద్ద ఎత్తున స్వాగతాలు, ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, కొత్త పథకాల పేర్లతో, రీ డిజైనింగ్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని కరవు, రైతుల పరిస్థితులపై స్థానిక బిజెపి నాయకత్వం రూపొందించిన కరపత్రాలను మాజి మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షులు బొల్లారం వెంకట్రాములు, కౌన్సిలర్ ఆలూరి నరేందర్, నాయకులు కాశన్న, అర్థంరవి ఉన్నారు.