మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణ సాధనకు కలిసొచ్చిన వారిని కలుపుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇతర పార్టీల నుండి తెరాసలోకి కలిసోచ్చిన వారిని కలుపుకుంటామని అందరం తెలంగాణ బిడ్డలమనే బావనతో ముందడుగు వేస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబందించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు సంబందించిన మండల, గ్రామస్థాయి నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ పక్క అభివృద్ధి మరొపక్క బంగారు తెలంగాణ నిర్మాణం ఆశయంతో తెరాసలోకి పెద్ద ఎత్తున స్వచ్చంధంగా ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని వారందరిని టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డలుగా భావిస్తుందని అందుకే తెలంగాణ బిడ్డలంతా గులాబీ నీడలోనే ఉండాలని కెసిఆర్ లక్ష్యం నేరవేరుతుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం త్వరలోనే చూడబోతున్నామని వెల్లడించారు. ఇతర పార్టీలలో ఉంటే ఇక రాజకీయ మనుగడ లేకుండా పోతుందని బావించిన చాలా మంది టిఆర్‌ఎస్‌లో వచ్చి చేరుతుండడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయని అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని ఈ విషయం తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలే గ్రహిస్తున్నారన్నారు. 60 ఏళ్ల సమైఖ్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని విస్మరించారని పేరుకు మాత్రమే జిల్లా కేంద్రమైన సదుపాయాలు కల్పించలేని నాయకుల కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిపోయిందని ఆరోపించారు. అందరు సహకరిస్తే మరో రెండేళ్లలో మహబూబ్‌నగరర్ పట్టణ అభివృద్ధి అన్ని జిల్లాల కన్న మెరుగ్గా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, సుధాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.