మహబూబ్‌నగర్

అరుణమ్మా..నీకిది తగునా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 2: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా వనపర్తి జిల్లాను ముసాయిదాలో ప్రభుత్వం ప్రకటించిందని, జిల్లాకు వనపర్తి అర్హత లేదని, గద్వాలను జిల్లాగా చేయాలని గద్వాల ఎమ్మెల్యే డీ.కె అరుణ మాట్లాడటం సరి కాదని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి.రాములు, పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పి ఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గద్వాల జిల్లాగా ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వనపర్తి జిల్లాకు అర్హత లేదని, గద్వాలను జిల్లాను చేయాలని కోరడం అరుణమ్మాకు తగదని వారు అన్నారు. ఎన్నికల సందర్భంలో కెసిఆర్ వనపర్తికి వచ్చిన సందర్భంగా వనపర్తిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆనాడే వనపర్తిని జిల్లాగా మారుస్తామని కెసి ఆర్ ప్రకటించారని, నాగర్‌కర్నూల్ నాయకులు స్టేజి పైనే కొరగా నాగర్‌కర్నూల్ కూడా జిల్లాగా ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారని వారు అన్నారు. ఆ సందర్భంలో ఏమి మాట్లాడకుండా ఉన్న డి.కె అరుణ నేడు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ జిల్లా ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని వారు విమర్శించారు. రాజకీయాలు గద్వాలలో చేస్తే తమకు అభ్యంతరం లేదని వనపర్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే తాము సహించబోమని వారు అన్నారు. వనపర్తిలో జిల్లాకు కావల్సిన అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయని, సమైక్యా రాష్ట్రంలోనే వనపర్తి జిల్లా కావాలని డిమాండ్ ఉన్నదని వారు గుర్తు చేశారు.