మహబూబ్‌నగర్

పాలమూరులో బైపాస్ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: పాలమూరు పట్టణ ప్రజల 32 ఏళ్ల కల సాకారం కాబోతుంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో కేవలం ప్రధాన రోడ్డు మార్గం ఒకటే ఉండడంతో ఏళ్ల తరబడి పట్టణవాసులు, జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి నిరంతరంగా వచ్చేపోయే వారికి ట్రాఫీక్ అంతరాయం కంగారు పెట్టిస్తుండేది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని 32 ఏళ్ల నుండి ప్రజలు బైపాస్ రోడ్డు కోసం కలవని నాయకులంటూ లేరు. అయితే ఎట్టకేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ బైపాస్ రోడ్డును మంజూరు చేస్తూ దాదాపు రూ.96కోట్ల నిధులను కూడా కేటాయించడంతో పాలమూరు పట్టణవాసుల కల నేరవేరబోతుంది. ఈ నెల 9వతేదిన జిల్లా విభజనపై కొన్ని అభ్యంతరాలను తెలిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గరకి మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితెందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు బేటి అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ పట్టణానికి బైపాస్ రోడ్డు అంశంపై సిఎం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తాను మహబూబ్‌నగర్ ఎంపిగా ఉన్నప్పుడే మంజూరు చేయాల్సి ఉండేదని అప్పటి పాలకులు చొరవ చూపలేదని తక్షణమే బైపాస్ రోడ్డుకు సంబందించిన ప్రతిపాదనలు ఎక్కడున్నాయని ఎమ్మెల్యేను అడగగా సెక్రెటెరియేట్‌లో ఉన్నాయని శ్రీనివాస్‌గౌడ్ చెప్పడంతో ముఖ్యమంత్రి నేరుగా సంబందిత అధికారులను పిలిపించి మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా రూ.96కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం తెలియడంతో శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు యువకులు, విద్యార్థులు, తెరాస నాయకులు, కార్యకర్తలు బైపాస్ సంబరాలు జరిపారు. ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్ ఎదుట టిఆర్‌ఎస్ నాయకులు బాణసంచా పెల్చీ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. టిఆర్‌ఎస్‌వి విద్యార్థులు బైపాస్ రోడ్డు మంజూరుపై పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా టిఆర్‌ఎస్ ఫౌండర్ ఫోరం అధ్యక్షులు కోట్ల కిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిసేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. పట్టణంలోని వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఎంపి జితెందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లను కలిసి బైపాస్ రోడ్డు మంజూరుకు కృషి చేసినందుకు గాను వారిని అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అయితే 32 ఏళ్ల నుండి బైపాస్ రోడ్డు కావాలంటూ పట్టణ ప్రజలు కన్న కలలు ఎట్టకేలకు రోడ్డు మంజూరితో ఇక రోడ్డు నిర్మాణం అవుతుందని ప్రజల ఆశలు నేరబోతున్నాయని పట్టణవాసులు భావిస్తున్నారు. దసరా నాటికి రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, కౌన్సిలర్లు వనజ, జ్యోతి, నాయకులు ఆనంద్‌గౌడ్, ఇంతియాజ్, సుదీప్‌రెడ్డి, మోహన్‌బాబు, చందుయాదవ్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా సంబరాల్లో పాల్గొన్నారు.

వీరవనిత చాకలి ఐలమ్మ

* తెలంగాణ పోరాట యోధురాలు
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: తెలంగాణ పోరాట యోదురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం చాకలి ఐలమ్మ వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ పట్టణంలో రజక సంఘం, తెలంగాణ ప్రజాసంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ అని ఆమెను స్పూర్తిగా తీసుకుని యావత్తు తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం పోరాటం చేయడం జరిగిందని తెలంగాణ ఉద్యమ సమయంలో వీరవనిత ఐలమ్మ గురించి ప్రస్తావించని సభనే లేదని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ఎన్నో పోరాటలకు నిలయంగా ఉన్న తెలంగాణలో ఎందరో త్యాగదనులు ఉన్నారని అలాంటి వారిలో ప్రముఖ మహిళ వీరవనితగా తెలంగాణ ప్రజలు పిలుచుకునే చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమెను యావత్తు తెలంగాణ ప్రజలు స్మరించుకుంటున్నారన్నారు. ఆమె చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఎతంగానో ఉపయోగపడేదని తమలాంటివారు ఐలమ్మ చరిత్రను తెలుసుకుని పోరాటంలోకి దిగామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చాకలి ఐలమ్మ గురించి యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేశాకే ఐలమ్మ చరిత్ర ప్రపంచానికి తెలిసిందన్నారు. స్వరాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలాంటి వీరవనిత వర్థంతిని జరుపుకుని ఆమె జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ పోరాట యోదుల చరిత్రలను కనుమరుగు చేశారని ఒకవేళ తెలంగాణ కోసం గతంలో పోరాటం చేసిన వారి గురించి చెప్పాలంటే ఎన్నో ఆంక్షాలు ఉండేవని ధైర్యం చేసి చెప్పదటుచుకుంటే అలాంటి వారిని కనబడకుండా చేసిన దుర్మార్గులు తెలంగాణను తమ గుప్పిట్లోకి పెట్టుకుని ఆరాచకాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ పోరాటంతో స్పూర్తిని పొందిన ప్రజలు ఉద్యమ పంతాల్లోకి దిగడంతో రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఓ భాద్యత గల ప్రభుత్వంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రకారులు, పోరాటయోదులను స్మరించుకోవడానికి జయంతులు, వర్థంతులను జరుపుతూ ఇంకా వారి స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ బంగారు తెలంగాణ కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రాజేశ్వర్‌గౌడ్, మోహన్‌బాబు, ఎమ్మార్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్..
అభివృద్ధిలో అగ్రగామి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: జిల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో అగ్రగామీగా నిలుస్తుందని జిల్లాకే ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా తయారు అవుతుందని టిఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత జితెందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జితెందర్‌రెడ్డి మాట్లాడుతూ పనిలేనివారు, జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించని వారు, ఓర్వలేని గుణం ఉన్నవారు జిల్లాలు ఏర్పడితే మహబూబ్‌నగర్‌కు నష్టం జరుగుతుందని తప్పుడు ప్రచారం, విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సాగు, తాగునీటి విషయంలో కొన్ని అనుమానాలు రావడంతో ఈ విషయంపై తాము ముఖ్యమంత్రి కెసిఆర్‌తో బేటీ అయ్యామని సిఎం దూరదృష్టితో, భవిష్యత్తులో పాలమూరును దృష్టిలో ఉంచుకుని తమకున్న అనుమానాలను నివృత్తి చేశారని ఇలాంటి సిఎం ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన హామీలను ఆమలు చేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే నాగిరెడ్డిపల్లి, నాగల్‌కడుమూర్, చంద్రగడ్ గ్రామాలు ఉండబోతున్నాయని ముసాయిదాలో వీటిని నర్వ మండలం నుండి తొలగించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆమరచింతలో కలిపారని తెలిపారు. అయితే నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ద్వారానే కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కృష్ణాజలాలు వస్తుంటాయని ఈ లిఫ్ట్ ఆమరచింతలో కలిపి వనపర్తి జిల్లాలో చేరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తాము సిఎం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆ మూడు గ్రామాలను నర్వ మండలంలోనే ఉంచుతూ మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారని జితెందర్‌రెడ్డి తెలిపారు. ఆత్మకూర్, ఆమరచింత, సిసికుంట మండలాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ఒకటి రెండు రోజుల్లో ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రికి సమాచారం చేరుతుందన్నారు. మహబూబ్‌నగర్‌కు బైపాస్ రోడ్డు తీసుకురావడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఎంతగానో కృషి చేశారని తాను ప్రత్యేకంగా ఎమ్మెల్యేను అభినందిస్తున్నానని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి పతంలో నడుస్తుందని జిల్లాలు ఏర్పడితే మహబూబ్‌నగర్ వెనుకబడిపోతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోకుండా పబ్బం గడపడానికి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణానికి తాగునీరు సమస్యనే ఉండదని తెలిపారు. నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంటున్నందున కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కృష్ణా జలాల డోకా లేదని అవసరమైతే తాము ముఖ్యమంత్రితో ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు ప్రాజెక్టు కేపాసిటీ పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని విస్మరించారని ఆరోపించారు. బైపాస్‌రోడ్డు కూడా సుందరవందనంగా ఉండబోతుందని రోడ్డుకు ఒకవైపు పరిశ్రమల ఏర్పాటుతో పాటు పట్టణానికి ఆధాయ వనరులు కల్పించే వివిధ సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు.

భారీ బందోబస్తు మధ్య గణనాథుల ఊరేగింపు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతిష్టించిన గణనాథులు ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకుని పాలమూరు పట్టణంలో ఆరవ రోజు శనివారం నిమజ్జనానికి బయలుదేరాయి. భక్తిశ్రద్దలతో ప్రజలు గణనాథులను నిమజ్జనం చేశారు. ఎటుచూసిన విఘ్నేశ్వరుల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. పట్టణంలో దాదాపు 600 మంది పోలీసు బందోబస్తు మధ్య గణనాథుల ఊరేగింపు కొనసాగింది. వివిధ విధుల నుండి ఊరేగింపుగా వచ్చిన గణనాథులు క్లాక్ టవర్ దగ్గర ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. అంతకుముందు బాలగంగాదర్ తిలక్ విగ్రహానికి వినాయక చవితి ఉత్సవ సమితి సభ్యులు పూలమాలలు వేసి వినాయకులను నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పాలమూరు పట్టణమంతా కషాయమయంగా మారింది. ఎటుచూసిన కషాయద్వజాలు రేపరేపలాడాయి. చిన్న పెద్ద తెడా లేకుండా వినాయక నిమజ్జన ఊరేగింపులో వేలాది మంది పాల్గొనడంతో క్లాక్ టవర్ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. వినాయక చవితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరికి వచ్చిన గణనాథులకు కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎంపి జితెందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వైస్ చైర్మన్ రాములు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, డిసిసి మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్, టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌పి.వెంకటేష్, విహెచ్‌పి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డిలు నిమజ్జనానికి వెళ్తున్న వినాయకులకు ప్రత్యేక పూజలు చేసి విడ్కోలు పలికారు. పాలమూరు పట్టణానికి సంబందించిన వినాయకులను బీచుపల్లి, రంగాపూర్ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. అక్కడ భారీ ఏర్పాటు చేశారు. అయితే మహబూబ్‌నగర్ డి ఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రతి మంటపం నుండి బయలుదేరిన గణనాథుల ఊరేగింపుకు భద్రత కల్పించారు. ఓఎస్‌డి కల్మేశ్వర్ సిగనావన్ ఎప్పటికప్పుడు ఊరేగింపు విషయాలను తెలుసుకున్నారు. ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రతిక్షణం పాలమూరు పట్టణంలో గణనాథుల ఊరేగింపు విషయాలను సంబందిత అధికారులతో తెలుసుకుని శాంతియుతంగా కొనసాగించాలని సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణం నుండి బీచుపల్లి, రంగాపూర్ దాదాపు 80కిలో మీటర్లపైగా ఉండడంతో ప్రభుత్వపరంగా ఊరేగింపుగా వచ్చిన గణనాథులు క్లాక్ టవర్ దగ్గరకు వచ్చిన తర్వాత పూజలు అందుకున్న అనంతరం వాటిని మున్సిపల్ మైదానంలోకి మళ్లించి అక్కడ నుండి పోలీసులు ఏర్పాటు చేసిన లారీలలో ఉంచి కృష్ణానదికి నిమజ్జనానికి తీసుకెళ్లారు. పాలమూరు పట్టణంలో వినాయకుల నిమజ్జన ఊరేగింపు జనసంద్రంగా మారింది. వాడవాడలో ఎటుచూసిన బొజ్జగణపయ్య ఊరేగింపు వేడుకలు అంగరంగవైభవంగా కొనసాగాయి. షాషాబ్‌గుట్ట, వన్‌టౌన్ ప్రాంతంలోని సమస్యాత్మకమైన విధుల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య గననాథుల ఊరేగింపు కొనసాగింది. క్లాక్ టవర్ దగ్గరకు పట్టణ ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకు మహిళలు ఆయా వినాయకుల వద్ద కోలాటలు, భజనలు నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు.

సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
గోపాల్‌పేట, సెప్టెంబర్ 10: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల అయిన నీరు గోపాల్‌పేట మండలంలో రైతుల మధ్య పెడుతున్న చిచ్చు కారణంగా రెండవ రోజు శనివారం కూడా మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో పలు గ్రామాలకు చెందిన రైతులు రాస్తారోకో చేశారు. గుడిపల్లి లిఫ్టు నుండి విడుదల అయిన నీరు తమ గ్రామాలకు రావడం లేదని శుక్రవారం రోజు గోపాల్‌పేటలో పొల్కెపహాడ్, చెన్నూరు, గోపాల్‌పేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. శనివారం కూడా గోపాల్‌పేట మండలానికి సమీపంలో ఉన్న గ్రామాలు అయిన అంకురు, చిమనగుంటపల్లి, వెంకటాయపల్లి పలు గ్రామాలకు చెందిన రైతులు బుద్దారం గ్రామంలో 10.30గంటల నుండి 1గంట వరకు రాస్తారోకో చేశారు. ప్రధానంగా అల్లిపూర్ సమీపంలో ఉన్న ప్రధాన కాల్వ నుండి నీరు తీసుకురావడానికి ఈ గ్రామాలకు చెందిన రైతులు ప్రయత్నించడంతో ఆ ప్రాంత రైతులు ఎదురుతీరడం వల్ల రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న వనపర్తి డి ఎస్పి జోగుల చెన్నయ్య, సి ఐ షాకిర్ ఉస్సేన్, గోపాల్‌పేట ఎస్ ఐ సైదులు, సిబ్బందితో బుద్దారం గ్రామానికి చేరుకున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందేలా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని, రైతులు ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచిది కాదని సమన్వయంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. పోలిసుల చొరవతో రైతులు రాస్తారోకోను విరమించారు.

బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఐడియాలజీ మిషన్ అధ్యక్షులు తలారి మద్దిలేటి, కార్యదర్శి శోభన్‌బాబునేడొక ప్రకటనలో తెలిపారు. నవ భారత నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర అనే అంశంపై నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల కేంద్రాలలో ఈనెల 30న ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ మొదటిగా పదివేలు, రెండో బహుమతిగా ఆరువేలు, మూడో బహుమతిగా మూడువేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న వందమందికి ప్రోత్సాహక బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు పాఠశాలలు, కళాశాల విద్యార్థులతోపాటు డిగ్రీ, పిజి చేసిన నిరుద్యోగులు కూడా అర్హులన్నారు.
గణనాథుల నిమజ్జనం
జడ్చర్ల, సెప్టెంబర్ 10: గత ఐదు రోజుల నుండి వివిధ ఆకృతులతో మంటపాల్లో కొలువైన గణనాథులు శనివారం సాయంత్రం నిమజ్జనానికి తరలారు. ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరులు బారీ బాణసంచాలు, బ్యాండ్ భజంత్రిలతో పట్టణంలోని పురవిధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
రైస్‌మిల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడి
వనపర్తి, సెప్టెంబర్ 10: వనపర్తి పట్టణంలోని వాసవి రైస్‌మిల్లులో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 136 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొల్లాపూర్ డిప్యూటి తహశీల్ధార్ రాంమోహన్, కొత్తకోట డిప్యూటి తహశీల్ధార్ చాణిక్యలు దాడులు చేసి అందులో నిల్వ ఉంచిన 50 కెజిల బస్తాలు 70ని సీజ్ చేసినట్లు తెలిపారు. రైస్‌మిల్లులో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి బస్తాలు మార్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఇచ్చిన సమాచారం మేరకు ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు వారు తెలిపారు. రిపోర్టును ఉన్నత అధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.
ఫ్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి
* ఎమ్మెల్యే అల
అడ్డాకుల, సెప్టెంబర్ 10: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నిజాలాపూర్ గ్రామంలో బాల వికాస్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన నీటి శుద్ధజల ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల వికాస్ ద్వారా 70శాతం నిధులను వెచ్ఛించి 30శాతం గ్రామస్తులు ఇవ్వటంతో నీటి శుద్ధజల్లాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా పరిశుభ్రతను పాటించేందుకు మహిళా సంఘాల సభ్యులు వీధులను శుభ్ర పరచడంలో గ్రామస్తులు జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నూటికి నూరు శాతం నిర్మించడంతో తాను వ్యక్తిగతంగా గ్రామానికి రూ.51000 నగదును గతంలోనే అందజేశానని అన్నారు. గ్రామాలను అబివృద్ధి పరిచేందుకు ప్రభుత్వంలో ప్రజలు భాగస్వామ్యం కావడం వల్ల మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు.
చెత్త బుట్టల పంపిణీ
నిజాలాపూర్ గ్రామంలో నూటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకునంద వల్ల ఎమ్మెల్యే రూ.51000 నగదు పురస్కారం మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వడంతో వాటిని వృధా చేయకుండా మహిళా సంఘ సభ్యులు ఇంటింటికి పారిశుధ్యం కోసం చెత్త బుట్టలను తీసుకొచ్చారు. వాటిని ఎమ్మెల్యే అల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి బగ్గి కమలమ్మ, సర్పంచులు ఇంధ్రయ్య సాగర్, భాస్కర్ గౌడ్, ఎంపిటిసి గోవిందమ్మ, మండల పార్టీ అధ్యక్షులు నాగార్జున్ రెడ్డి, నాయకులు భీమన్న, ఆంజనేయులు, రవి, వెంకటేష్, ఎంపిడి ఎ నర్సింగ్ రావు, బాలవికాస్ ప్రతినిధి శ్రీనివాస్ రావు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

.