మహబూబ్‌నగర్

అన్నదానం మహాదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 12: అన్ని దా నాలకన్నా అన్నదానం మ హాదానం గొప్పదని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అ న్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయక వి గ్రహం దగ్గర అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించా రు. రెవెన్యూ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి అన్నదాన కా ర్యక్రమంలో పాల్గొని ప్రా రంభించారు. మనిషి జీ వించాలంటే ఆహారం ఎం తో అవసరమని అటువంటి ఆహారాన్ని సమకూర్చడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రానికి విచ్చేసిన పలువురు వివిధ మండలాలకు చెందిన వారికి అన్నదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చాలామంది ఎంతో దూరం నుండి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వస్తుంటారని అటువంటివారికి ఆకలిబాధను తీర్చడం ఎంతో సంతోషమన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ భాస్కర్, బిసి కార్పోరేషన్ అధికారి రాజేందర్, క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.