మహబూబ్‌నగర్

విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 13: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుడండంతో పాలమూరు జిల్లా తడిసిముదైంది. సోమవారం రాత్రి నుండి మంగళవారం రోజంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు జలకళగా మారాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో కురుసిన వర్షం భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు చర్చించుకున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేర్ మండలంలో 6 సెం.మీల భారీ వర్షం కురిసింది. గద్వాల, ఆత్మకూర్, ధరూర్, మాడ్గుల మండలాల్లో 5.5సెం.మీల వర్షం కురియగా దాంతవ వాగులు వంకలు పారుతున్నాయి. ఆమనగల్లు, వెల్దండ, మిడ్జిల్, కల్వకుర్తి, అమ్రాబాద్, వంగూర్, ఇటిక్యాల, మక్తల్ మండలాల్లో 4సెం.మీల వర్షపాతం నమోదు అయ్యింది. పెద్దమందడి, వనపర్తి, గోపాల్‌పేట, కోడేరు, మానవపాడు, అచ్చంపేట , కొల్లాపూర్ మండలాల్లో 3సెం.మీలకు పైగా భారీ వర్షం కురిసింది. హన్వాడ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, తాడూర్, ఉప్పునుంతల, లింగాల, వనపర్తి, కోత్తకొట, మాగనూర్, నర్వ, ఘణపురం, బిజినేపల్లి, వీపనగండ్ల, వడ్డెపల్లి, అలంపూర్ మండలాల్లో 2 సెం.మీలకుపైగా వర్షం కురిసింది. కాగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. ఎడతెరిపిలేని వర్షం గంటల తరబడి కురుస్తుండడంతో రోడ్లపై వర్షపునీరు నిరంతరంగా పారుతుంది. భారీ వర్షం రావడంతో వర్షపునీరు వరదలా ప్రవహించింది. న్యూటౌన్‌లోని పెద్ద చెరువు కాలువ, బ్రిడ్జి పొంగిపోర్లింది. కలెక్టరేట్ ఆవరణలోకి వరదనీరు వచ్చి చేరింది. హైదరాబాద్- రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపడంతో అన్ని మండల్లా విస్తారంగా వర్షాలు కురిశాయి. దామరగ్ది, 1సెం.మీ, బాలనగర్ 1.7 సెం.మీ, కొందుర్గు, షాద్‌నగర్, కొత్తూర్, కేశంపేట, తలకొండపల్లి, జడ్చర్ల, దేవరకద్ర మండలాల్లో సైతం దాదాపు 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. కాగా ముసురుతో కూడిన భారీ వర్షం కురుస్తుండంతో పాత ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.