మహబూబ్‌నగర్

మహిళల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ బాధ్యత అందరిపై ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 1: మహిళల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ భాద్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. పిల్లలను చిన్నప్పటి నుండే సరైన పౌష్టికాహరం ఇచ్చి పెంచడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి యువశక్తి ఉపయోగపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. పౌష్టికాహార దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని టిడిగుట్ట ఆరవ అంగర్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరై అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్‌వాడీ పిల్లలతో మాట్లాడడంతో పాటు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహరం, హజరు రిజిస్టర్, బరువు రిజిస్టర్ తదితర వివరాలను తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదిన ప్రత్యేకంగా ఆరోగ్యం, పౌష్టికాహరంపై అంగన్‌వాడీ కేంద్రాల్లో చర్చించాలని తెలిపారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల పెరుగుదలపై రూపొందించిన చార్టుపై చర్చించి బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి వారు బరువు తక్కువగా ఉండడానికి గల కారణాలు తెలుసుకోవాలని అలాంటి వారికి జిల్లా ఆసుపత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రానికి పంపించాలని సూచించారు. మనదేశంలో ప్రసూతి సమయంలో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మహిళల్లో ప్రత్యేకించి గర్భిణిస్ర్తిలు, బాలింతలకు రక్తహీనతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని పిల్లలు వయసు పెరిగే కొద్ది బరువు కూడా పెరగాలని బరువులో తగ్గుదల ఉన్నట్లు అయితే జబ్బు ఉన్నట్లు గుర్తించి వెంటనే చికిత్స ఇప్పించాలని అన్నారు. మాతశిశు మరణాల శాతం జిల్లాలో ఎక్కువగా ఉందని వీటని ఆరికట్టేందుకు చిన్నపిల్లలకు ముర్రుపాలు తాగించాలని, అలాగే పౌష్టికాహారంతో పాటు సమయానికి వ్యాక్సిన్ ఇప్పించాలని అన్నారు. గర్భిణీ స్ర్తిలకు గర్భం మొదలైనప్పటి నుండి ప్రసవం వరకు నిరంతరంగా పరీలు నిర్వహించాలని 3-6 సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్‌వాడీ ద్వారా బడికి వెళ్లేందుకు సన్నద్దం చేసే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి జోత్న్స, డిఆర్‌డిఏ, మెప్మా పిడి లింగ్యానాయక్, డిఎంఅండ్‌హెచ్‌ఓ పార్వతి, సిడిపి ఓలు తహశీల్దార్ ఆమరేందర్, కౌన్సిలర్ షౌకత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.