మహబూబ్‌నగర్

చేనేతను పరిశ్రమల శాఖలో కలపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: చేనేత రంగాన్ని పరిశ్రమల శాఖలో కలపొద్దంటూ జిల్లా చేనేత అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో తెలంగాణ చేనేతల అఖిల పక్ష ఐక్యవేదిక కన్వీనర్ వీరన్న, గౌరవ అధ్యక్షులు వెంకటేష్‌లు మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయ వారసత్వ సంపదలో భాగమైన చేనేత వృత్తిపై లక్షల కుటుంబాలు ఆదారపడి బతుకుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యవస్థను కార్మికశాఖలో విలీనం చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులపై చిత్తశుద్ద్ధి ఉంటే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. చేనేత ప్రత్యేక శాఖగానే ఉంచాలని వారు కోరారు. చేనేతకు ప్రత్యేక పాలసీని చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేకంగా ఈ రంగానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ చేనేత మిషన్ ఏర్పాటు చేయాలని తాము కోరుతుంటే వాటికి విరుద్దంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.2000 జీవన భృతి ఇవ్వాలి అన్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని పారిశ్రామిక వెత్తలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టిపెట్టడం మంచిపద్దతి కాదని అన్నారు. చేనేత రంగాన్ని పూర్తిగా విచ్చినం చేయడానికి మాత్రం చేనే శాఖకు పరిశ్రమలశాఖలో కలపడానికి వీలుపడుతుందని కార్మికుల సంక్షేమం కోసం మాత్రం కాదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సప్ప, వెంకటస్వామి, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.