మహబూబ్‌నగర్

సమష్టి సహకారంతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 25: అందరి సహకారంతో మహబూబ్‌నగర్ పట్టణం అభివృద్ది చేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూటౌన్‌లో నిర్మించబోయే బిడ్జ్రి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రోడ్డు వెడల్పు పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహాం దగ్గర పాత ప్రహరి గోడను కూల్చివేత పనులకు సైతం ఆయన శ్రీకారం చుట్టారు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో వర్షం కురిస్తే ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా న్యూటౌన్‌లో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా రోడ్డుపై ఐదారు ఫీట్ల నీరు వచ్చి చేరుతుండడం ప్రజలకు నరకాన్ని తలపిస్తుందని అన్నారు. ఈ సమస్య నేటిది కాదని, దాదాపు ముప్పై ఏళ్ల నుండి సమస్య ఉందని ఈ సమస్యను ఎవరు తీర్చలేకపోయారని అన్నారు. తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ రూ.39 లక్షలతో కూడిన బిడ్జ్రి నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరి చేశానని అన్నారు. రెండు మూడు నెలలలో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో రోడ్లు ఇరుకుగా ఉందని దినిని దృష్టిలో పెట్టుకుని పాలమూరు పట్టణంలో రోడ్డు విస్తరణ జరుతుందని అన్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర రోడ్డు వెడల్పు చేస్తున్నామని ఈ విషయాన్ని చూసి ప్రజలే స్వచ్చందంగా రోడ్డు వెడల్పుకు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజల సహకారంలేనిది ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేయరని తాను ప్రజల భాగస్వామ్యంతో జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ రోడ్డు డిఇ రవికుమార్, మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, నాయకులు రాజేశం, రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, పిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.