మహబూబ్‌నగర్

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, పేద కుటుంబాలకు చెందిన వారికి మంచి విద్య, మంచి వైద్య సేవలు అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం దాతల సహకారంతో తరగతి గదులలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు. పెప్సి సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉదయంపూట పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. దాదాపు 1200 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు మంచి సౌకర్యాలను కల్పించడంతోపాటు వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు హెచ్‌ఎం రమేశ్, ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రులలో అందించాలనే కృతనిశ్చయంతో వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొని రావడం జరిగిందన్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో గదుల కొరతను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు నగదు ఇచ్చి రెండు గదులను నిర్మించడం అభినందనీయమన్నారు. దాతల సహకారంతో విద్యార్థులకోసం వివిధ కార్యక్రమాలను చేపట్టిన ఈపాఠశాలకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని, అదనపు గదుల మంజూరుకు సహకరించడం జరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధ్ది కోసం రెండుకోట్లతో ప్రతిపాదనలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, దీనికి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, సిఐ రాంబాబు, జడ్పీటిసిలు నరేందర్‌రెడ్డి, సువర్ణ, మణెమ్మ, ఎంపిపిలు రాములు, శాంతమ్మ, పాఠశాల హెచ్‌ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.