మహబూబ్‌నగర్

ఇంటికో ఉద్యోగం హామీని విస్మరించిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఓట్లను వేసుకుని గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ హామీని విస్మరించారని గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని షాలిమార్ గార్డెన్ ఫంక్షన్ హల్‌లో యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను రి డిజైన్ చేస్తూ వాటి పేరిట కోట్ల రుపాయలను దండుకోవడానికి మొదలుపెట్టారని ఆరోపించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రజలకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులు దాదాపు 90 శాతం పూర్తి అయ్యాయని మిగిలిన 5 నుండి 10 శాతానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నాంచుడు దోరణిని అవలంబిస్తుందన్నారు. రి డిజైన్ల పేరిట పేదల ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రాజెక్టులకు అనవసరంగా కోట్లాది రుపాయలు కేటాయిస్తూ డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి రాబోయే ఖరీఫ్ సిజన్‌లో రైతులకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా పోరాటలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు పని చేయాలన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధేనని టిఆర్‌ఎస్ నాయకులు తామే తెలంగాణ తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ప్రజెంటేషన్ల పేరిట కేవలం ఉకదంపుడు ప్రచారాన్ని చేసుకుంటున్నారని మైండ్ గేమ్ ఆడడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దీట్ట అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని పేద ప్రజలను డబుల్ బెడ్‌రూం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన డబుల్ బెడ్‌రూం పథకమే టిఆర్‌ఎస్ పతనానికి కారణం కాబోతుందని అన్నారు. ఒక్క నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూంలు ఇస్తే ఒక గ్రామానికి ఎనప్ని ఇళ్లు నిర్మించి ఇస్తారో ముక్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. గ్రామానికి నాలుగైదు ఇళ్లు ఇచ్చి గ్రామాల్లో చిచ్చుపెట్టే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తెర లేపనున్నారని ద్వజమెత్తారు. యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో నిజమైన లబ్దిదారులన జాబితాను తయారు చేసి డబుల్ బెడ్‌రూంలు కావాలని డిమాండ్‌తో కూడిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పాలన తప్పా ప్రజా పాలన కొనసాగడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం దిష్టిబొమ్మల్లా మారారని వారికి సోంతంగా నిధులు మంజూరు చేసే స్వచ్చ కూడా లేకుండా పోయిందని ఎద్దెవా చేశారు. ఈ సమావేశంలో మాజి ఎంపి మల్లురవి, మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్, కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, శివసేనరెడ్డి, నందిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.