మహబూబ్‌నగర్

పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి హర్షనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడులను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని ఇది ఎప్పుడో జరగాల్సింది అని అయినప్పటికిని దేశ ప్రజలంతా భారత ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో బేటీ అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత సైన్యానికి భారత ప్రజానికం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఏ ఒక్కరు కూడా ఉపేక్షించరాదని దేశంలో అలాంటి మూలాలను ఎక్కడికక్కడ రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాక్ ఉగ్రవాదుల శిభిరాలపై దాడులు చేయడం హర్షించదగ్గ విషయమని ప్రస్తుతం భారతీయులంతా ఐక్యతతో సైన్యానికి మద్దతు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను విస్మరించిన కెసిఆర్
రైతులను ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని దయాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉల్లిరైతుల పరిస్థితి ఆయోమయంగా ఉందని ప్రస్తుతం వర్షాల కారణంగా ఉల్లి రైతుకు తీవ్రనష్టం ఏర్పడిందని ఆరోపించారు. రాబోయే రబీ సిజన్‌లో జిల్లా రైతాంగానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని అవసరమైతే ఉచితంగా కూడా అందించిన రైతులకు మరింత లాభం ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని లక్ష రుపాయల రుణమాఫీ విషయంలో దాగాచేసి వారిని బ్యాంకుల చుట్టూ తిప్పేలా చేసిందని ఆరోపించారు.
గత సంవత్సరానికి సంబందించిన పంటనష్ట పరిహారం నేటికి రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటివల జిల్లాలో కురిసిన వర్షాలకు దాదాపు 5వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యంగా వర్షాలు ఆగస్టు మాసంలో కురియకపోవడంతో జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్లలో మొక్కజోన్నపంట పూర్తిగా దెబ్బతిందని అలాంటి రైతాంగానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 88 గ్రామాలకు మంచినీటిని అందించే మక్తల్ సత్యసాయి నీటి పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలు గడుస్తున్న ఆ పథకంపై ఎందుకు దృష్టి సారించలేదని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ నాయకులు చెప్పుకుంటున్న జలకళ ఎక్కడ నుండి వచ్చిందో ఓ సారి ఆలోచించుకోవాలని గత ప్రభుత్వాలలో తవ్విన కాలువల ద్వారానే అప్పట్లో నిర్మించిన రిజర్వాయర్‌లోకి నీరు వచ్చి చేరిందని ఈ విషయాన్ని మంత్రి హరీష్‌రావు గ్లోబల్ ప్రచారం చేసుకోకుండా పరిపాలన చూసుకోవాలని హితవు పలికారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఎందుకోసం తెరపైకి తెస్తున్నారో అర్థం కావడం లేదని, వరదలు వస్తున్నందున నీటిని ఇక్కడే ఎత్తిపోసుకుంటే సమస్యలే ఉత్పన్నం కావని కావాలని ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ డ్రామాలకు తెర లేపారన్నారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, నేతలు బాలప్ప, హరికృష్ణ, మల్యాద్రిరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.