మహబూబ్‌నగర్

రబీకి సర్వం సిద్ద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: ఈ ఏడాది వర్షాలు సంవృద్దిగా కురియడంతో ఖరీఫ్ సిజన్ ముగిసి మరో ఒకటిరెండు రోజుల్లో రబీలోకి అడుగు పెట్టెందుకు జిల్లా రైతాంగం సర్వం సిద్దమైంది. గత పదేళ్ల నుండి రబీలో సాగుచేసిన పంటలకంటే ఈ దఫా అదనంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు పలు రిజర్వాయర్లు, చెరువుల కింద రబీలోనే సాగులోకి రానుంది. దాంతో జిల్లా రైతాంగానికి ఎరువులు, విత్తనాలు వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. అదేవిధంగా వందలాది క్వింటాళ్ల విత్తనాలు కూడా అవసరం ఉంది. దినిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు రబీ సిజన్‌కు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రబీ సిజన్‌ను దృష్టిలో ఉంచుకుని 5వేల మెట్రిక్ టన్నుల ఎరువులు, లక్ష క్వింటాళ్ల పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఇది ఇలా ఉండగా రబీ సిజన్‌లో రైతులు అధికంగా వేరుశనగను సాగుచేయనున్నడంతో వేరుశనగ విత్తనానికి ధర అధికంగా ఉండడంతో జిల్లా రైతాంగానికి శరఘాతంగా మారింది. వేరుశనగపై సబ్సిడి కూడా తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో 50శాతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేవారు ప్రస్తుతం 30శాతం సబ్సిడీ మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియజేయడంతో రైతుల నెత్తిపై గుదిబండపడింది. 50శాతం సబ్సిడీ ఉన్నప్పుడే విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడ్డామని సబ్సిడీ తగ్గించడంతో భారం కొనుగోలు చేయలేకపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కృష్ణాజలాలు, నెట్టెంపాడు, జూరాల, కల్వకుర్తి, భీమ ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లు నిండడంతో ఈ రబీ సిజన్‌లోనే దాదాపు నాలుగు లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి రానుంది. అయితే ఇక్కడ రైతాంగానికి వరి విత్తనాలతో పాటు అన్ని రకాల విత్తనాలు అవసరం ఉన్నాయి. దినిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఇప్పటి నుండే విత్తనాలను కొనుగోలు చేసుకుని రబీకి సన్నద్దం అవుతున్నారు. అధికారులు మాత్రం రబీలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని సూచిస్తున్నప్పటికిని రైతులు మాత్రం తమ పొలాల్లో ఎలాంటి పంటలు పండుతాయో దానిని దృష్టిలో పెట్టుకుని సాగుచేయాల్సి వస్తుందని తెల్చి చెబుతున్నారు. ఏది ఎమైనప్పటికిని జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో మొత్తం మీద 6లక్షల హెక్టార్లలో కనివిని ఎరుగని రితీలో జిల్లా రైతాంగం పంటలు చేసుకునే అవకాశం లభించబోతుంది. మార్కెట్‌లోకి ఎరువులు, విత్తనాలను మాత్రం ప్రభుత్వం అందుబాటులో ఉంచడం ఎప్పటికప్పుడు మండలాల వారిగా జిల్లా అధికార యంత్రాంగం విత్తనాలు, ఎరువులకై నివేదికలు తెప్పించుకుని అవసరాన్ని బట్టి విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో ఉంచుతున్నారు.