నల్గొండ

కొత్త పాలనకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 29: అక్టోబర్ 1నాటికి కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. సూర్యాపేట నూతన జిల్లా ఏర్పాటుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. దస్త్రాల స్కానింగ్ ఇప్పటి వరకు 90శాతం మేర పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సూర్యాపేటలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకోసం ఈ పాటికే భవనాలను గుర్తించారు. కలెక్టర్ కార్యాలయాన్ని పట్టణ సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద గల కామాక్షి కళాశాలలో ఏర్పాటుచేశారు. దీనిలోనే వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటుచేశారు. 26ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఇదే సముదాయంలో ఏర్పాటుచేసి సమీకృత కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటుచేశారు. అదే విధంగా పట్టణంలోని కాసరబాదరోడ్డులో గల ఇండోర్ స్టేడియంలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. కలెక్టర్, ఎస్పి కార్యాలయాల్లో కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఫర్నిచర్, పార్టీషన్ల పనులు పూర్తికావచ్చాయి. ఎస్పి కార్యాలయానికి పహారా ఏర్పాటుచేసి పరేడ్ గ్రౌండ్‌గా తీర్చిదిద్దే పనులు చేపడుతున్నారు. సుమారు 60 ప్రభుత్వ కార్యాలయాలను పట్టణంలో ఏర్పాటుచేస్తున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేయగా మిగిలిన ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పట్టణంలో ఉన్న పాత డివిజన్ కార్యాలయాల భవనాలు, అద్దె భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అన్ని కార్యాలయాల్లో ఫర్నిచర్ ఇతర సౌకర్యాలను అక్టోబర్ 1నాటికి పూర్తిచేయనున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్, ఫైల్‌ల తరలింపు కార్యక్రమాలను ఆయా శాఖల ఉన్నత ఆధికారులు చేపడుతున్నారు. కొత్త జిల్లా కార్యాలయాల్లో సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం రూ. 1కోటి నిధులను మంజూరు చేసినట్లు ప్రకటించినప్పటికి ఇప్పటివరకు ఒక్కో జిల్లాకు రూ. 25లక్షల నిధులను మాత్రమే విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కార్యాలయాల భవనాలతో పాటు జిల్లాస్థాయి ప్రధాన అధికారుల వసతిగృహాల ఎంపిక సైతం పూర్తిచేశారు. పట్టణంలోని వాణిజ్యభవన్ సమీపంలో గల రెండు ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకొని వాటిలో కలెక్టర్, జెసి బంగ్లాలను ఏర్పాటుచేస్తున్నారు.
అదే విధంగా పట్టణంలోని విజయకాలనీలో ఎస్పీ బంగ్లాను ఎంపికచేశారు. ఈ భవనాల్లో కూడా చేపట్టాల్సిన మరమ్మత్తుల పనులు చేపడుతున్నారు.
పేట జిల్లాకు
రెండు ఎంపిడివో పోస్టులు
నూతనంగా ఆవిర్భావించనున్న సూర్యాపేట జిల్లాకు రెండు ఎంపిడివో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న అనంతగిరి, నాగారం మండలాలకు వీటిని కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నూతన జిల్లాలకు ఉద్యోగుల విభజనను కూడా మరో రెండురోజుల్లో పూర్తిచేసి దసరాకు ముందే అన్ని కార్యాలయాల్లో సిబ్బంది నియామకం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.