మహబూబ్‌నగర్

అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 30: అన్నీ రంగాలలో వెనక్కినెట్టివేయబడిన పాలమూరు జిల్లాను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్షాలనేతలు వాటిని అడ్డుకుంటున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం వడ్డేమాన్ గ్రామంలో కెఎల్‌ఐ కాలువల ద్వారా చెరువులోకి వచ్చిన నీటికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ 30ఏళ్ల నుంచి కెఎల్‌ఐని ఎన్నికల నినాదంగా తీసుకున్నారేగాని, దానిని పూర్తి చేయాలనే చిత్తశుద్ది టిడిపి, కాంగ్రెస్ నేతలు లేదన్నారు. అన్నీరకాల వనరులున్న పాలమూరు జిల్లాను సీమాంధ్ర పాలకులు ఉద్దేశ్యపూర్వంగా వెనక్కినెట్టివేశారని, దీనికి జిల్లాకు చెందిన ఆయా పార్టీల నాయకులు వంతపాడుతూ జిల్లా అభివృద్ది గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కెఎల్‌ఐ ప్రాజెక్టుకు సంబందించి నాగం జనార్ధన్ తరచుగా ఫిర్యాదులు చేయడంతో ఇదేసాకుగా తీసుకొని అప్పటి సీమాంధ్ర పాలకులు విచారణ పేరుతో విపరీతమైన జాప్యం చేశారని, కెఎల్‌ఐ ప్రాజెక్టు జాప్యం కావడానికి ఒకరకంగా నాగం జనార్ధన్‌రెడ్డి కారకుడన్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టుకు సంబందించిన కాలువలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఒకేసారి మోటార్లు నడిపితే కాలువలపైనుంచి నీరు ప్రవహించి పంట పొలాలను నాశనం చేసేవిధంగా కాలువలు ఉన్నాయని అన్నారు.
కాంట్రాక్టర్లతో అప్పటి నేతలు కుమ్మక్కు కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాను వెనక్కినెట్టివేయడానికి కారకులైన వారే నేడు జిల్లా అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొంతరాష్ట్రంలో జిల్లాను అభివృద్ది పర్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర, జాతీయ నాయకులు వివిధ రూపాలలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.