మెదక్

కరవు నివారణ చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 31: జిల్లాలో కరవు నివారణ చర్యలు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు పశువులతో వినూత్న నిరసన చేపట్టారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని పశువులకు నీటి తొట్టిలు, పశుగ్రాసం కొరతను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో కరువు విలాయతాండవం చేస్తుంటే అసెంబ్లీలో మాత్రం ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అందరికి అన్నం పెట్టే రైతన్న ప్రస్తుతం కష్టాల కొలివిలో మాడి మశై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మండుతున్న ఎండలతో నీరు, పశుగ్రాసం లేక మూగజీవాలు అల్లాడుతున్నాయన్నారు. ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేక ఫ్యాకేజీలను కేటాయించి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. గ్రామాల్లో పనులు లేక ఉపాధి కూలీలు పట్టణాల బాట పడుతున్నారని, కూలీలకు 200రోజుల పనులను కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, జయరాజు, జిల్లా కమిటి సభ్యులు ప్రవీన్, మల్లేశ్వరి, నాయకులు అశోక్, మహాబూబ్‌ఖాన్, మహేష్, శ్రీనివాస్, హనుమంతు, బస్వరాజ్, నర్సింలు, రాము, షఫీ, గణేష్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.