మెదక్

జిల్లాలో 40 గ్రూప్-2 పరీక్షా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 4: మెదక్ జిల్లాలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు 40 ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నర్సాపూర్‌లో(11), తూప్రాన్‌లో(11), మెదక్‌లో(11), చేగుంట(7)లో మొత్తం 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 11, 13వ తేదిల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నాం 12:30 గంటల వరకు, మద్యాహ్నాం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షల జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8:15 నుండి 9:45 గంటలలోగా, మద్యాహ్నాం 1:15 నుండి 2:15 గంటలలోపు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందని జేసి తెలిపారు. మొదటి పరీక్షకు గైర్వాజరైన వారిని రెండవ పరీక్షకు అనుమతించరాదని జేసి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి బంగారు అభరణాలు, సెల్‌ఫొన్లు, క్యాలుక్‌లేటర్, ఎలట్రానిక్ యంత్రాలు తీసుకొని వెళ్లరాదని, బూట్లను నిషేదించడం జరిగిందని జేసి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తహశీల్దార్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు వ్రాసే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షిస్తారని, పరీక్ష కేంద్రంలో అన్ని ఏర్పాట్లను చీఫ్ సూపరిండెంట్‌లు చేసుకోవాలని ఆదేశించినట్లు జేసి తెలిపారు. పరీక్షలు పారద్శకతతో నిర్వహించాలని, పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో త్రాగునీరు, వైద్యం, నిరంతర విద్యుత్‌తో పాటు అన్ని వౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధితులు ఎలాంటి పొరపాట్లకు తావిచ్చినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడిపేలా, పోలీస్ బందోబస్తును చీఫ్ సూపరిండెంట్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని జేసి సురేష్‌బాబు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 114 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 114 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, ఇందులో 47 కేంద్రాల ద్వారా 38,756 క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 34 వేల 458 క్వింటళ్ల ధాన్యం రైస్‌మిల్లులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రెండు లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన చోటకు సరఫరా చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వరి పంట పచ్చగా ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని జేసి తెలిపారు.
మీసేవా కేంద్రాల సేవలు పునరుద్దరణ
మీ సేవా కేంద్రాలలో సేవలు అందుబాటులోకి వచ్చాయని, మీ సేవా కేంద్రాలలో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు తెలిపారు.