మెదక్

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, నవంబర్ 8: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌లోని ఆమె క్యాంప్ కార్యాలయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంభీకులకు పరిహారం చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆహర్నిషలు కృషి చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి పాలనలో రైతులకు సహకారాలు అందకపోవడంతో అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిననాటి నుండి కెసిఆర్ ప్రభుత్వం రైతుల అభివృద్ది కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంభాలకు వెంటవెంటనే పరిహారాలు చెల్లిస్తూ వారి కుటుంభాలకు ధైర్యం చెబుతున్నామన్నారు. నిజాంపేట మండలం కొమ్మాట మల్లయ్య 2014లో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆయన కొడుకు బిక్షపతికి 4.50 లక్షల చెక్కును ఆమె చేతుల మీదుగా అందించారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మార్కెట్ కమిటి చైర్మన్ కృష్ణారెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.