మెదక్

ప్రజాసమస్యలు విస్మరించి అవకాశ రాజకీయాలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 1: అవకాశవాద రాజకీయాలను టిఆర్‌ఎస్ పెంచిపోషిస్తుందని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా విస్మరిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 4, 5, 14, 17వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ రాజకీయాలను దిగదారుస్తుందన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నవి కాదన్నారు. అభ్యర్థులను బలవంతపెట్టి, భయపెట్టి,ప్రలోభాలకుగురి చేసి ఏకగ్రీవం చేసుకుంటుందన్నారు. రాజకీయాల్లో ఇది ఎక్కువ కాలం ఉండదన్నారు. త్వరలో వారికి ప్రజలు గుణపాఠం చెప్పకపోరన్నారు. వార్డుల పర్యటనలో ప్రజలు ఎన్నో సమస్యలు చెప్పారన్నారు. పట్టణంలో మంచినీటి ఎద్దడి ఉందని, ఆస్తిపన్ను, నీటిపన్నులు పెంచుతు మనుగడకు భంగం కలిగిస్తున్నారన్న విషయాలు చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడం లేదన్నారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖలో ఉన్న నియమ నిబందనలు పక్కనబెట్టి జనాభా ప్రాతిపధికన సిద్దిపేటను అమృత్ సిటి పథకంలో కేంద్రం చేర్చిందన్నారు. అమృత్ సిటి పథకం ద్వార అనేక రకాల నిధులు సమాకురుతాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పథకంలో మంత్రి ఇంత వరకు సిద్దిపేటలో ఒక్క డబుల్ బెడ్‌రూం కూడా కట్టించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఆదుకునే దిశగా రెండు వేల ఇండ్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. బీడి కార్మికు పుర్రెగుర్తు శాపంగా మారిందన్నారు. పుర్రెగుర్తును మూడు మాసాల్లో తొలగించడానికి కృషి చేస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిద్దిపేటలోని చిన్నవ్యాపారులు, చేతివృత్తుల వారికి ముద్ర యోజన రుణాలు ఇప్పిస్తామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇనె్నల్లుగా అవకాశం ఇచ్చిన వారి పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. మార్పుకోసం బిజెపికి ఓటు వేయడానికి సిద్దమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, నేతలు వంగ రామచంద్రారెడ్డి, రాంచంద్రారావు, పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, కనకయ్య తిదతరులు పాల్గొన్నారు.