మెదక్

రెండు పడకల ఇళ్ల నిర్మాణం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నర్సాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం నిర్మాణాలు, మార్కెట్‌యార్డులో గోదాంల నిర్మాణాల పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 1960 ఇళ్లను నర్సాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి ఫేజ్‌లో 59 బ్లాక్‌ల్లో 708 ఇళ్లు, రెండో విడుతలో 35 బ్లాక్‌ల్లో 420 ఇళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 డిసెంబర్‌లోగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని కంట్రాక్టర్లు చెప్పగా అక్కెనపల్లి వాగు నుండి తెప్పించి డబుల్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలన్నారు. అక్కెనపల్లి వాగునుండి ఇసుక రవాణా చేసే వాహనాల నెంబర్లు పోలీస్‌స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల్లో అందచేయాలన్నారు. వాటిపై పెద్దఎత్తున ప్లక్సిలు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణాపై అక్రమాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణ వాహనాలను అధికార యంత్రాగం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం 230 రూపాయలకు సిమెంట్ అందచేస్తుందన్నారు. అలాగే నియోజక వర్గంలో మరో 10గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆరు గ్రామాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మరోనాలుగు గ్రామాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజక వర్గానికి మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేసేందుకు సిఎం కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుండగా హైదరాబాద్‌లో లక్ష, మిగత లక్ష నియోజక వర్గాల వారిగా కేటాయిస్తారని మంత్రి తెలిపారు.
నియోజక వర్గంలో 30వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణం
సిద్దిపేట నియోజక వర్గ పరిధిలో 30 వేల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో 20వేల మెట్రిక్ టన్నులకు 10వేల మెట్రిక్ టన్నుల పూర్తయినాయని, మరో 10వేలు టన్నులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో 5వేల మెట్రిక్ టన్నులు, మిట్టపల్లిలో మరో 5వేల టన్నులు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్ ఎస్‌ఇని ఆదేశించినట్లు తెలిపారు. సిద్దిపేట మార్కెట్‌యార్డులో క్లినింగ్ కోసం స్విపింగ్ మిషన్ కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. యార్డులో తాగునీరు, అన్ని షెడ్లలో ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పేర్కన్నారు.
12 కోట్లతో సమీకృత మార్కెట్, 2.50 కోట్లతో రైతుబజార్
12 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌యార్డును మొదటి దశను జనవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూల మార్కెట్ యార్డు మొదటి దశ పూర్తిగాకావచ్చినట్లు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానున్నట్లు పేర్కొన్నారు. 2.50కోట్లతో నిర్మిస్తున్న మోడల్ రైతుబజార్ 100రోజుల్లో నిర్మాణం పూర్తి చేయలాని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. తాత్కలిక రైతుబజార్ స్థలంలో 6 కోట్లతో ఆడిటోరియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నకోడూరులో 1.40 కోట్ల మార్కెట్ యార్డు కార్యాలయం, రైతు విశ్రాంతి భవనం, రోడ్లు, ప్రహరిగోడ నిర్మించనున్నట్లు తెలిపారు. 30లక్షలతో చిన్నకోడూరులో రైతు బజార్ నిర్మించనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ, రైతుబజార్‌లను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నాయకుడు రాధకిషన్‌శర్మ, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు బాలరంగం, రవీందర్‌రెడ్డి,వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏడుపాయలకు కార్తీక శోభ

పాపన్నపేట, నవంబర్ 13:సుప్రసిద్ధి శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తజనం వెల్లువెత్తింది. కార్తీక మాసాన్ని పురష్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. డప్పుచప్పులు...బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. తెలంగాణలోని జిల్లాలు, హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువల తరలివచ్చారు. లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లెదారి కిటకిటలాడింది. భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు వ్రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలొ కొరడా పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా, లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వనదుర్గామాత దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఓడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. సంతాన గుండంలో దంపతులు స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలను, తొట్టెల్లను కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి భారీ బందోబస్తు నిర్వహించారు.

సిఎం వియ్యంకుడు ఎవరివైపు?

* ప్రజలను తప్పుదోవ పట్టించి అభివృద్ధిని అడ్డుకోవడం తగునా..?
* రామాయంపేట ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి

రామాయంపేట, నవంబర్ 13: ముఖ్యమంత్రి వియ్యంకుడు హరినాథరావు ఎవరి వైపు..ఆయన కేసిఆర్‌కు వ్యతిరేకమా లేదా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికా స్పష్టం చేయాలని ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి ప్రశ్నించారు. ఆదివారం తెరాస పార్టీ నాయకులు జడ్పీటిసి బిజ్జ విజయలక్ష్మీ, వైస్ ఎంపిపి జితేందర్‌గౌడ్, సర్పంచు పాతూరి ప్రభావతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ అందె కొండల్‌రెడ్డి, మండల, పట్టణ అద్యక్షులు రమేష్‌రెడ్డి, పుట్టి యాదగిరి, మాజీ ఎంపిపి సంపత్‌లతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలు పునర్విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్ రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సిఎంకు విన్నవించినట్లు వారు తెలిపారు. నిజాంపేట మండలంతో పాటు రామాయంపేటను డివిజన్ చేస్తే ఈప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు. కొంత మంది స్వార్థ రాజకీయాల వల్ల వారి ఉనికి కోసమే వచ్చిన డివిజన్‌ను పద్మాదేవేందర్‌రెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో డివిజన్ ఫైల్ ఉందని ఆయన ఇస్తానంటే ఎలా వద్దంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ కోసం తాము ప్రయత్నించడం లేదంటే ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని సవాలు విసిరారు. తెలంగాణ ఉద్యమంలో 14సంవత్సరాలు పోరాటం చేస్తే కనిపించని హరినాథరావు ఇప్పుడు వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం సబబు కాదన్నారు. గతంలో రామాయంపేటకు వచ్చినప్పుడు కేటిఆర్ విదేశి పర్యటనలో ఉన్నాడు రాగానే మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఇచ్చిన హామి ఏమైందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడిగా ఉండి స్వార్థ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ అబివృద్దిని అడ్డుకోవడం ఏమిటన్నారు. ముఖ్యమంత్రి వియ్యంకుడివే కదా చేతనైతే తీసుకురా స్వాగతిస్తాం..లేదంటే ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఈసమావేశంలో మాజీ ఎంపిటిసి పోచమ్మల ఐలయ్య, సుభాష్, నవాత్ కిరణ్, పొల్కం నాగార్జున్‌లు ఉన్నారు.