మెదక్

ఘనంగా కోతకాలపు పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 13: మెదక్ సిఎస్‌ఐ మహాదేవాలయం(చర్చి)లో ఆదివారం కోతకాలపు పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. భక్తులు వారికి పండిన కూరగాయలు, పండ్లు, ధాన్యము, పూలు తెచ్చి గుడిలో అలంకరణ చేశారు. గుడి ప్రదేశమంతా అరటితోరణాలు, కొబ్బరిమట్టలతో అలంకరించారు. భక్తులు సదూర ప్రాంతాల నుండి తరలివచ్చి ఈ పండుగలో పాలుపంచుకున్నారు. మెదక్ బిషప్ రైట్ రెవ.సల్మాన్‌రాజ్ భక్తులను ఉద్దేశించి కోతకాలపు పండుగ విషయమై సుధీర్ఘంగా వివరించారు. కరువు కాటకాల నుండి భగవంతుడు మంచి వర్షాలు కురిపించి ప్రజలను ఆదుకున్నాడని ఆయన తెలిపారు. ఎక్కడ చూసినా నధులు, చెరువులు, ప్రాజెక్ట్‌లు నీళ్లతో నిండి కళకళలాడుతున్నాయన్నారు. ఈ పండుగలో ప్రిసిబిటరి ఇంచార్జీ రెవ.ర్యాబిన్‌సన్, అసిస్టెంట్ ప్రిసిబిటరి ఇంచార్జీ రెవ.విజయ్‌కుమార్, రెవ.విజయ్‌సాగర్, ప్రాంక్ జాన్సన్, గంట సంపత్, సంశన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సండే స్కూల్ విద్యార్థులు ప్రత్యేక పాటలను ఆలపించారు.