మెదక్

వికలాంగులకు పై అంతస్తులో పరీక్షలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 13: వికలాంగులు గ్రూప్-2 పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా హవేళీఘణాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం పట్ల జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూప్-2 పరీక్షల సందర్భంగా ఆదివారం డైట్‌ను సందర్శించారు. దివ్యాంగులకు కింది గదులు కేటాయించకుండా పై అంతస్థుల్లో ఎందుకు ఏర్పాటుచేశారని ప్రిన్సిపాల్ రమేశ్‌బాబును ప్రశ్నించారు. మద్యాహ్నాం పరీక్షను కిందనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వికలాంగులైనప్పటికీ మనోధైర్యంతో పరీక్షకు హాజరవుతున్నవారికి ఆల్‌దిబెస్ట్ తెలిపారు. టాయిలెట్స్ ఉపయోగించేందుకు డబ్బులు, సెల్‌ఫోన్ చార్జింగ్ చేసుకోవడానికి డబ్బులు వసూలు చేస్తున్న విషయం కలెక్టర్ దృష్టికితేగా ఎందుకు వసూలు చేస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. తక్కువ ధరకు భోజనం సమకూర్చాలని సూచించారు. మానవతాదృక్పథంతో ప్రాధాన్యతనిచ్చి వికలాంగులైన అభ్యర్థులను అన్నివిధాల సౌకర్యాలు కల్నించాలని సూచించారు.

ఘనంగా ..
ధాత్రీ..దామోదర
కల్యాణోత్సవం
పెద్దశంకరంపేట, నవంబర్ 13: కార్తీకమాసం వైకుంఠ చతుర్దశి సందర్భంగా స్థానిక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో వేద బ్రాహ్మణోత్తములు దాత్రి దామోదర కళ్యాణోత్సవాన్ని భక్తి ప్రవక్తులతో ఘనంగా నిర్వహించారు. ప్రతి కార్తీకమాసంలో దాత్రి దామోదర కళ్యాణాన్ని తులసీ, ఉసిరి చెట్ల క్రింద పీటలు వేసి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణోత్తములు తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో ఉసిరి చెట్టు ఉన్నందున అక్కడ పెద్దయేత్తున మహిళలు చేరుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తములు లక్ష వత్తుల హోమాన్ని భక్తి ప్రవక్తులతో నిర్వహించారు. మహిళలు వేలాది దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మహిళలు 108 ప్రదక్షణాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాలగ్రామదానాలు, దీప దానాలను బ్రాహ్మణోత్తములకు మహిళలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. వేద బ్రాహ్మణోత్తములు రాయల కృష్ణశర్మ, అనంతరాజ్, మహేశ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి
రూ. 2 లక్షల చెక్కు అందజేత
గజ్వేల్, నవంబర్ 13: మండల పరిదిలోని అహ్మదీపూర్‌లో విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన చాడా రాజిరెడ్డి కుటుంబానికి ఆదివారం రూ. 2 లక్షల చెక్కును ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ ఎంపిపి చిన్నమల్లయ్య, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, టిఅర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
బ్యాంకుల వద్ద
కొనసాగిన రద్దీ
* పోలీసు బందోబస్తు మధ్య
పెద్ద నోట్ల పంపిణీ
* తెల్లవారుజాము నుంచే
బారులుతీరిన డిపాజిటర్లు
గజ్వేల్, నవంబర్ 13: పెద్ద నోట్ల మార్పిడీకి ప్రభుత్వం బ్యాంకులకు ఆదివారం సైతం తెరచి ఉంచాలని ఆదేశించడంతో తెల్లవారుజాము నుండే డిపాజిటర్లు బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా బ్యాంకుల వద్దకు ఖాతాదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నిర్వాహకులు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఎటిఎంలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రూ. 2 వేల నోట్లు మినహా రూ. 100, రూ. 50 నోట్లను బ్యాంకర్లు ఖాతాదారులకు ఇవ్వకపోవడంతో చిన్న రూపాయల సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే చిన్న నోట్ల సమస్యలేదని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ బ్యాంకర్లు పట్టించుకోకపోతుండడంతో వ్యాపారుల పంట పండుతోంది. కాగా ఈ పరిస్థితి నియోజకవర్గ పరిదిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంద్రా బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ నెలకొంది.
మీసేవ కేంద్రాల్లో
జెసి తనిఖీలు
సిద్దిపేట, నవంబర్ 13: సిద్దిపేట జెసి హన్మంతరావు ఆదివారం సాయంత్రం సిద్దిపేటలోని మీసేవ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

సంగారెడ్డి టౌన్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు అభ్యర్థులు అంతాంత మాత్రమే ఆసక్తి కనబర్చడంతో హాజరు (51.22) శాతం సగాని సగమే నమోదైంది. జిల్లాలో మొత్తం 88పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 33244మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా కేవలం 17022మంది అభ్యర్థులు మాత్రమే హాజరు కాగా 16218మంది గైర్హాజర్ అయ్యారు. అభ్యర్థులు గంట ముందుగానే వారి వారి సెంటర్లకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షను రాసారు. సంగారెడ్డిలో 46 కేంద్రాలకు గాను15136 మంది హాజరు కావాల్సి ఉండగా 7386 మంది హాజరు కాగా 7750 మంది గైర్హాజరయ్యారు. పటాన్‌చెరులో 31 కేంద్రాలకు గాను 14292 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 7639మంది హాజరు కాగా 6653 మంది గైర్హాజరయ్యారు. రామచంద్రాపూర్‌లో 11కేంద్రాలకు గాను 3816 మంది హాజరు కావాల్సి ఉండగా 2001 హాజరు కాగా 1815 మంది హాజరు కాలేదు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.