మెదక్

క్షేత్రస్థాయిలో నష్టంపై పరిశీలనేదీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 14: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్దిపేట జిల్లాకు వచ్చింది. ప్రకృతి వైపరిత్యం వల్ల నష్టపోయిన రైతులను, బాధితులు క్షేత్ర పర్యటనకు వచ్చిన కేంద్రబృందానికి పంటనష్టం పై సమగ్రంగా వివరించేందుకు వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాయంత్రాంగం సైతం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చే జిల్లాలోని రామునిపట్ల, అనంతసాగర్, గోనెపల్లి, గజ్వేల్‌లోని కొడకండ్ల గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గం. నుంచి 1వరకు వివిధ గ్రామాల్లో క్షేత్ర పర్యటనలు చేపట్టి పంటనష్ట వివరాలు బాధితులతో చర్చించి సమగ్రంగా అంచనా వేసి నివేదిక తయారు చేయాల్సి ఉండేది. కానీ 12గం. తర్వాత సిద్దిపేటకు వచ్చిన బృందం సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి సర్కిల్ ఎస్‌ఇ ఓఆర్‌కె రెడ్డి, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ డిప్యూటి డైరక్టర్ జగదీష్‌కుమార్‌తో కూడిన బృందం వచ్చింది. ఆర్డీఓ కార్యాలయంలో సమాచార, పౌరసంబంధశాఖ ఆధ్వర్యంలో అకాలవర్షాలకు నష్టపోయిన పంట, ఇండ్లు, పశువుల నష్టం వివరాలకు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జిల్లాలోని గ్రామాల్లో జరిగిన నష్టం పై ఫోటో ఎగ్జిబిషన్‌లో కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి వివరించి నష్టం పై నివేదిక అందించారు. కాగా తమ గ్రామాలకు వస్తారని ఎంతో ఆశపడ్డ అన్నదాతలు, బాధితులు బృందం రాకపోవడం వల్ల నిరాశకు గురైనారు. కేంద్రబృందానికి సిఎం కెసిఆర్‌తో సమావేశం ఉన్నందునే క్షేత్రపర్యటనకు పోలేదని అధికార యంత్రాంగం చెప్పడం గమనార్హం.