మెదక్

సిద్దిపేటలో జిల్లాలో రూ.212.44 కోట్ల పంట నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 14 : సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల 212.44 కోట్ల పంట నష్టం సంభవించిందని..శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సహాయం అందించాలని కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నివేదిక అందచేశారు. సోమవారం సిద్దిపేట జిల్లాలో వరద నష్టం అంచనవేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. అందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద నష్టం వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి సర్కిల్ ఎస్‌ఇ ఓఆర్‌కే రెడ్డి, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీశ్‌ప్రసాద్‌లతో కూడిన కేంద్ర బృందం జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ,నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, పశుసంవర్థక శాఖలు, సిద్దిపేట మున్సిపాల్టీలో పరిధిలో జరిగిన నష్టంపై సమాచార, పౌరసంబంధాల శాఖ, ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలను తిలకించారు. మరిన్ని వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం ఫొటోలను కేంద్ర బృందం ఆసక్తిగా తిలకించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ జరిగిన నష్టం సహాయక కార్యక్రమాల కొరకు వ్యవసాయ శాఖకు 6.32 కోట్లు ఉద్యాన వన శాఖకు 1.07 కోట్లు, పశుంసంవర్థక శాఖ 3.55 లక్షలు, నీటిపారుదల శాఖ 29.41 కోట్లు, పంచాయతీరాజ్‌కు 95.35 కోట్లు, రహదారులుభవనాల శాఖకు 70.81 కోట్లు, ఇండ్ల కొరకు 2.20 కోట్లు, మున్సిపాల్టీకి 12.22 కోట్లు మొత్తం 212.44 కోట్ల రూపాయలు అవసరమని అంచనావేసినట్లు తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని కోరారు. ఈకార్యక్రమంలో జెసి హన్మంత్‌రావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ బాలనర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.