మెదక్

దివ్యాంగుల క్రీడోత్సవాలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 21: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి వికలాంగుల క్రీడాపోటీలను మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి సోమవారం ప్రారంభించారు. మెదక్ స్టేడియంలో ప్రవేశించిన జిల్లా కలెక్టర్‌కు వికలాంగులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఎవరైతే పుష్పగుచ్చాలు ఇచ్చారో ఆ పుష్పగుచ్చాలను వికలాంగులకు అందజేసి జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసిడియస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి నిర్మలతో కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులకన్నా మనమే అధిక సంఖ్యలో ఉన్నామని కలెక్టర్ చురక వేశారు. వికలాంగులు యువజన సంఘాల అసోసియేషన్లతో సమావేశమై జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ఎంతమంది ఉన్నారో నివేదిక సమర్పించాలని ఆమె ఐసిడియస్ ప్రాజెక్ట్ అధికారి నిర్మలను ఆదేశించారు. అయితే ఈ క్రీడలలో వికలాంగ క్రీడాకారులు 10 నుండి 17 సంవత్సరాల వయస్సును కేటాయించడంతో అత్యధిక సంఖ్యలో వికలాంగులు లేరని నిర్మల కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆ తరువాత సుమారు రెండు గంటల పాటు వికలాంగులతో క్రీడా పోటిల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా 100 మీటర్ల వికలాంగుల ట్రై సైకిల్ పరుగుపందెంను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ట్రైసైకిల్ పోటీలో మెదక్ న్యూహైస్కూల్ చెందిన సిహెచ్.శివ, మాల్తుమ్‌కు చెందిన దీక్షిత్‌కుమార్, హావేళి ఘణాపూర్ పాఠశాలకు చెందిన మస్తాన్‌బాబా, టియస్‌ఆర్‌యస్ మెదక్ చెందిన నాగమణి, కొల్చారం స్కూల్‌కు చెందిన రమేశ్‌లు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియం క్యారమ్‌బోర్డు ఫైనల్ పోటీలో హావేళి ఘణాపూర్‌కు చెందిన ఆర్.అజయ్, కొల్చారం పాఠశాలకు చెందిన రమేశ్ అనే విద్యార్థులు పోటిపడ్డారు. చెస్‌లో బాలికలు పోటీ పడ్డారు. అదే విధంగా వికలాంగ బాలబాలికల పరుగుపందెం కూడా నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలలో అత్యధిక సంఖ్యలో వికలాంగులు పాల్గొనకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మెదక్, నర్సాపూర్, కొల్చారం మండలాలకు చెందిన వికలాంగులు మాత్రమే హాజరయ్యారు. జిల్లా స్థాయిలో 10 నుండి 17 సంవత్సరాలలోపు వికలాంగులు లేకపోవడం సంతోషించదగిన విషయమని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి నుండి మండల, డివిజన్ స్థాయిలో వికలాంగుల క్రీడలు నిర్వహించి చివరగా జిల్లా స్థాయి వికలాంగుల క్రీడా పోటిలను జిల్లా కేంద్రం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని ఐసిడియస్ ప్రాజెక్ట్ అధికారి నిర్మలను ఆదేశించారు. ట్రైసైకిళు పరుగుపందెంలో దీక్షిత్‌కుమార్ మొదటి స్థానంలో గెలుపొందారు. రెండవ స్థానంలో ఎండి.మస్తాన్, మూడవ స్థానంలో శివ గెలుపొందారు. పరుగుపందెంలో ఆర్.అజయ్ ప్రథమ, ఎల్.విజయ్ ద్వితీయ, జె.రమేశ్‌లు తృతీయ స్థానంలో గెలుపొందారు. బాలికల రన్నింగ్‌లో ప్రథమ స్థానంలో అర్థోఫెడిక్ బాలికల నాగమణి, ద్వితీయ స్థానంలో వికలాంగురాలు మాధవి గెలుపొందినట్లు ప్రకటించారు. షార్ట్‌పుట్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో వికలాంగులు రాకేష్, అజయ్, ఎల్.విజయ్, శివకుమార్, రమేశ్‌బాబు పాల్గొన్నారు. ఈ క్రీడలను జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రారంభించి వికలాంగుల ప్రతిభను తిలకించారు. వచ్చే క్రీడలలో వికలాంగులకు క్రీడల పట్ల తర్బీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి ఆదేశించారు. ఆ తరువాత లయన్స్ క్లబ్ ఆఫ్ మంజీర ఏర్పాటు చేసిన భోజన వసతులను పరిశీలించారు. వికలాంగ విద్యార్థులకు కలెక్టర్ భోజనాన్ని వడ్డించారు.