మెదక్

నేర రహిత గ్రామాలుగా మార్చడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 22 : సిద్దిపేట కమిషనరేట్‌ను రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలతోమమేకమై పనిచేయాలని పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సిపి కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు అవసరమగు చర్యలు చేపట్టాలని సూచించారు. నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక కృషిచేయాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పోలీసులు పాలుపంచుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారి తనంగా పనిచేయాలన్నారు. పోలీసు అధికారులకు దశ, నిర్దేశం చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
మావోయిస్టులు లొంగిపోవాలి
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 మంది మావోయిస్టులు ఆజ్ఞాతంలో ఉన్నారని సిపి శివకుమార్ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మావోయిస్టు కుటుంబ సభ్యులను కలసి కౌన్సిలింగ్ ఇచ్చి లొంగిపోయేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారిపేరున ఉన్న రివార్డుతో పాటు పునరావాసానికి కృషిచేస్తామన్నారు. ఆజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంత ఒరిస్సా, చత్తిస్‌గడ్, బీహార్, ఝార్కండ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారికి నెట్ వర్క్ తగ్గిపోయిందన్నారు.