మెదక్

విధి నిర్వహణలో అలసత్వంపై కలెక్టర్ ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 22: విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు ఉపాధిహామి టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి సస్పెండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట, దుబ్బాక మండలాలకు చెందిన ఉపాధిహామి అధికారులు, ఎంపిడిఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిద్దిపేట మండలం మాచాపూర్‌కు చెందిన ఎఫ్‌ఏ కృష్ణారెడ్డి, టిఏ శ్రీనివాస్‌ల పై కలెక్టర్ మండిపడ్డారు. తాను పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని చెప్పినా అధికారుల తీరు మారకపోవడంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ సమీక్షలోనే సస్పెన్షన్ చేయాలంటు పిడి సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. ఎంపిడిఓలు, ఏపిఓలు, సిబ్బంది సైతం విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉపాధిహామిలో వందలాది మంది కూలీలు జాబ్‌కార్డులో నమోదైతే పదుల సంఖ్యలో పని చేయడమేందని ప్రశ్నించారు. కూలీల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వందశాతం కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు దరిచేర్చాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు. ఎంపిడిఓలు సైతం వారంలో 3రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు ఆచరణలో ఉండేలా చూడాలన్నారు. నిధులు, విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారు.