మెదక్

ఎర్రవల్లి, నర్సన్నపేటలు పచ్చదనం పరచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ములుగు, డిసెంబర్ 9: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో ఎక్కడ చూసినా చెట్లతో పచ్చగా, నిండుగా కనిపించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒఎస్టీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలలో హరితహారం క్రింద మొక్కలు నాటుతుండడాన్ని ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఎర్రవల్లిలో పూర్తయిన డబల్‌బెడ్రూం ఇళ్లను ఆనుకొని నాటిన మొక్కలను జాగ్రత్తగా చూడాలని, సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలుగా నర్సన్నపేట, ఎర్రవల్లిలను గుర్తించిన విషయాన్ని అధికారులు ఎప్పుడూ మర్చిపోవద్దని స్పష్టం చేశారు. అనంతరం నర్సన్నపేటలో నాటేందుకు సిద్దంగా ఉంచిన మొక్కలను పరిశీలించడంతోపాటు ఈ రెండు గ్రామాల ప్రజలు ఎంతో అదృష్టవంతులని, రూపురేఖలను మార్చుతున్న సిఎం కెసిఆర్‌కు రుణపడి ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటికి 7 చొప్పున పండ్ల మొక్కలు, కరివేపాకు, దానిమ్మ, జామ, మామిడి, నిమ్మ మొక్కలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో అక్కడక్కడా వేప చెట్లు, కొబ్బరి చెట్లు నాటాలని, మేకలు, ఇతర జంతువులతో నష్టం కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ రెండు గ్రామాలలో మొక్కలు నాటడం జరుగుతుందని, నాటిన ప్రతి మొక్క పెరిగేలా పర్యవేక్షించే బాద్యతను ఇంటి యజమానులకు అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.
కాగా నాటిన మొక్క ఎండిపోయినా, పెరగకసోయినా వెయ్యి రూపాయల జరిమానా సంబందిత వ్యక్తుల నుండి వసూలు చేయడం జరగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. మొక్క త్వరగా పెరిగేందుకు అవసరమైన ఎర్రమట్టి, జిప్సంను వినియోగించాలని వివరించారు. అటవీ అధికారి శ్రీదర్‌రావు, గ్రామాభివృద్ది కమిటీల ప్రతినిదులు పాల్గొన్నారు.

కనుమరుగవుతున్న కుల వృత్తులను కాపాడుకుందాం

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 9: కుల వృత్తులను అభివృద్ధి చేసేందుకు బిసి సంఘాల సమాఖ్య సభ్యులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బిసి సంఘాల సమాఖ్య, జిల్లా సంక్షేమ సంఘం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న కుల వృత్తులకు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బిసి సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసిందని, సభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి కుల వృత్తులకు జీవం పోయాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలు సకాలంలో లబ్ధిదారుడికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ బిసి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి రెండు మాసాల కోసారి కమిటీ సమావేశం నిర్వహించాలని, గ్రూప్ రుణాల విషయంలో బ్యాంకుకు సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చే విధంగా చూడాలని కోరారు. విశ్వబ్రహ్మణ సంఘం నాయకుడు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో షెడ్స్ వేసుకొని కుల వృత్తిని కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. జిల్లా సంక్షేమాధికారి ఆశన్న మాట్లాడుతూ జిల్లాలో సుమారు 11వందల సంఘాలు ఉన్నాయని, ఇందులో 70గ్రూప్‌లకు బ్యాంక్ కన్సంట్ వచ్చిందన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని బిసిలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఇఇ దామోదర్, డిఆర్‌డిఓ ఎడి సిద్దారెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.