మెదక్

తెలంగాణ కోసం సోనియా త్యాగం అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,డిసెంబర్ 9: అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్‌డే సందర్భంగా శుక్రవారంనాడు కెక్ కట్ చేసి ఘనంగా జరుపుకొన్నారు. నర్సాపూర్‌లోని అంధుల పాఠశాల భవనంలో మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ బర్త్‌డేను ఘనంగా జరుపుకొన్నారు. ఈసందర్భంగా కెక్ కట్ చేసి అంధ విద్యార్థులకు పంచిపెట్టారు. ఈసందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ బర్త్‌డేను పురస్కరించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ తీర్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని ఎన్నటికి మరువలేరని అన్నారు. ఆమె త్యాగ ఫలితంగానే నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఎంపిపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్త, అంద పాఠశాల ప్రిన్సిపాల్ ప్రబాకర్, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, మల్లేశ్, రమణారావు, లలిత, రాజు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి.
కేంద్రంలోని నరేంద్రమోది ప్రభుత్వం అవలంభించిన అనాలోచిత వైఖరీ వల్ల ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారంనాడు నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత నెల 8న తీసుకున్న పెద్ధ నోట్ల రద్ధు నిర్ణయం ప్రజల పాలిట శాపమైందని అన్నారు. 30రోజులుగా ప్రజలు పడరాని పాట్లు పడుతన్నారని అన్నారు. మోది అనాలోచిత వైకరి వల్ల సామాన్య, మద్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని అరోపించారు. ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వృద్ధులకు రెండు నెలలుగా ఫించన్‌లు అందడం లేదని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగునీరు
* ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
పెద్దశంకరంపేట, డిసెంబర్ 9: నేటి రబీ సీజన్‌లో తైబందు చేసిన చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని, ఇందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక నీటిపారుదల శాఖ అతిథి గృహంలో ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలు సంవృద్దిగా కురిసినందున రైతులు పంటలు సంవృద్దిగా వేసుకునేందుకు ముందుకు వస్తారన్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం కంటే ఎక్కువ తైబంది కూడా జరిగిందని, ఇందుకు కారణం చెరువుల్లో నీరు సంవృద్దిగా ఉండటం, భూగర్భ జలాలు పెరగడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా కాలువల మరమత్తు, పూడికతీత పనులను వెంటనే చేపట్టి రైతులకు నీరందే విధంగా చూడాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు గైకొంటుందన్నారు. అలాగే ఫేజ్-2 క్రింద పనులను వెంటనే చేపట్టాలని, ఫెస్-3లో అవసరమున్న అన్ని పనులకు ప్రతిపాధనలు పెట్టాలన్నారు. ఏ చెరువుల కాలువలు కూడా అసంపూర్తిగా ఉండద్దని, వచ్చే 10 సంవత్సరాల వరకు రైతులకు నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు కూడా ఉన్న నీటిని సక్రమంగా వాడుకోవాలని, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకునేందకు ముందుకు రావాలని భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో స్వచ్చ భారత్ మిషన్ లక్ష్యం పూర్తి అయ్యేలా అధికారులకు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు సహకరించాలన్నారు. ఎస్‌బియం పథకం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించి మార్చి నెలాఖరునాటికి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర గీతా పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ రామాగౌడ్, మండల తెరాస అధ్యక్షులు, మల్కాపూర్ సర్పంచ్ విజయరామరాజు, పేట సర్పంచ్ జంగం శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు సుభాష్‌గౌడ్, తెరాస నాయకులు మురళీపంతులు తదితరులు ఉన్నారు.