మెదక్

గోదావరి జలాలతో ఖేడ్‌కు కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ డిసెంబర్ 9: నారాయణఖేడ్ నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇందుకు కారణం గత పాలకులేనని తేలిందని, అందుకుగాను ఉప ఎన్నికలకు ముందు నుంచి ఖేడ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఉప ఎన్నికల్లో రైతులకు ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని వ్యవసాయా మార్కెట్ భవనంలో నూతన
కమిటీ పాలకవర్గం చైర్మెన్ బిడేకనే్న హన్మంతు డైరెక్టర్‌లకు మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ యార్డు నూతన భవనం ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట మేరకు 15 కోట్ల రుపాయలు సబ్‌మార్కెట్ పెద్దశంకరంపేటలో, ఖేడ్‌లో మార్కెట్ యార్డు భవనం, ధాన్యం నిలువ కోసం గోదాములు నిర్మించడం జరిగిందన్నారు. రైతుల అందుకు పత్తి పంటను ఇక్కడే అమ్ముకోవాలని పత్తికి మంచిగా మద్దతు ధర ఉందన్నారు. కందులు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. ధళారులకు ఏ ధాన్యం పంటను విక్రయించ రాదన్నారు. చెరువులకు పూడిక తీసి చెరువుల్లో నీళ్లు పుస్కలంగా నిండేందుకు కృషి చేసామని, దీంతో రైతులకు 9 గంటలు విద్యుత్తు ఇస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇస్తునట్లు చెప్పారు. రైతులకు అనుగుణంగా 13 విద్యుత్తు సబ్‌స్టేషన్లు నిర్మించి కరెంటు నిరంతరం మధ్మాహ్నం వెళల్లో 9గంటలు ఇస్తున్నామన్నారు. రోడ్లు మంజూరు చేసి బీటి రోడ్డులు ఖేడ్ నుంచి కంగ్టి వరకు, ఖేడ్ నుండి కరసుగుత్తి వరకు. ఖేడ్ నుంచి రాయిపల్లి వరకు డబ్బుల్ రోడ్డులు నిర్మిస్తున్నామని సంవత్సరం వరకు అన్ని రోడ్లు పూర్తియి రహదారులుగా మారుతాయన్నారు. ముఖ్యంగా ఖేడ్ నియోజకవర్గం రైతులకు గోదావరి జాలాలతో 80 ఎకరాలు భూములకు సాగునీరు అందించి రైతులకు అందుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాపరంగా నాలుగు ఎస్టీ గురుకుల పాఠశాలలు, రెండు మైనార్టీ గురుకుల పాఠశాలలు, రూ.17 కోట్లతో మంజూరు చేసి భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. మార్కెట్ యార్డు ముందు రోడ్డు కోసం బిబిపాటిల్ ఫండ్స్ నుంచి 40లక్షలు రుపాయలు తాగునీరు, సిసిరోడ్డు నిర్మాణం కోసం 60లక్షల రుపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మాడల్ మార్కెట్ యార్డుగా మారుస్తానని అన్నారు. ఈసందర్భంగా హన్మంతు గజామాలతో మంత్రి హరీష్‌కు, ఎంపి బిబిపాటిల్‌ని, ఎమ్మెల్యే ఎం, భూపాల్‌రెడ్డి , చైర్‌పర్సన్ రాజమణిని సన్మానించారు. చేర్మెన్ డైరెక్టర్‌లకు మంత్రి పూలమాలతో సన్మానించారు. ఇందులో ఎంపి బిబిపాటిల్, ఎమ్మెల్యే ఎం, భూపాల్‌రెడ్డి .జడ్పీ చైర్మెన్ రాజమణి మురళియాదవ్, రామాగౌడ్, మార్కెట్ కమిటీ తెలంగాణ డైరెక్టర్ మల్లేషం, డిప్యూటీ ఎస్పీ, శ్రీనివాస్, స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బాసిత్, స్థానిక నాయకులు ప్రభాకర్, గితా, మున్వార్, నవాబ్, ఎంపిపిలు రామారావు, లక్ష్మీబాయి, జడ్పీటిసి సభ్యులు రవి, నిరంజన్, మాల్‌శేట్టియాదవ్, రవి, జూకల్ సర్పంచు బుజిబాయి, తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో యాంకర్‌లు మంగళి, బిత్తిరి సత్తి ఇద్దరు పాల్గొని అట పాటలు పాడుతూ రైతులకు విద్యార్థులకు ఎంతో సంతోషం, అనందాన్ని కలిగించారు.

అడవుల పునరుజ్జీవనానికి
గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టు

గజ్వేల్, డిసెంబర్ 9: రాష్ట్రంలో 30 వేల ఎకరాలలో సహజ అడవుల పునరుజ్జీవన కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని, అందులో భాగంగా గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సిఎం కార్యాలయ ఒఎస్‌డి, హరితహారం ఇంచార్జి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని సింగాయపల్లి, నర్సన్నపేట, ఎర్రవల్లి, నర్సంపల్లి గ్రామాలలోని అటవీ భూములను జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డితో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అటవీ భూముల్లో పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపడుతున్నందున సంబంధిత అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాలలో పెంచుతున్న మొక్కలు త్వరితంగా పెరిగేందుకు, అలాగే మధ్యలో అంతరించిపోకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కలప తొలగింపు, ముఖ్యమైన మొక్కలే పెరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. నర్సంపల్లి ఫారెస్ట్‌లో దాదాపు 300 ఎకరాలు, సింగాయపల్లి ఫారెస్ట్‌లో 150 ఎకరాలు ఎంపిక చేయగా, ఎర్రవల్లి, నర్సన్నపేటలతోపాటు హరితహారం కార్యక్రమం చేపట్టిన ప్రాంతాలలో పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్నందున అటవీ, ఇతర శాఖల సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదిలేదని, అయితే రాష్ట్రంలో తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు వెంబడి రాజీవ్ రహదారి పొడవునా, అడవిని వదిలి ఫైర్‌లైన్‌గా మార్చటం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే మండే స్వభావం కలిగిన వాటిని విసిరినప్పటికి అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజవయవంతం చేసేందుకు కృషి చేస్తామని, అటవీశాఖ అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసి వృక్షాలు, అడవులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఒఎస్‌డి, కలెక్టర్ ఈ కార్యక్రమం క్రింద కూలీ పనిచేసేందుకు వచ్చిన ఒరిస్సా కార్మికులతో మాట్లాడారు. జిల్లా అటవీ అధికారి శ్రీ్ధర్‌రావుకూడా ఉన్నారు.