మెదక్

భక్తిశ్రద్ధలతో శివ లింగ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 10: కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామ శివాలయంలో శనివారం లింగ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి లింగ ప్రతిష్ఠ చేశారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఘనంగా గో పూజోత్సవం

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 10: గోపూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ శివారులోని వైకుంఠపురంలో శనివారం గోపూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు గోశాలలోని గోవులను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందన్నారు. కార్యక్రమంలో హిందూవాహిని నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం
గజ్వేల్, డిసెంబర్ 10: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని దర్మారెడ్డిపల్లి, అక్కారం గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్హులందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు, పెన్షన్‌లు, రేషన్‌కార్డులు, షాదీముభారక్, కళ్యాణలక్ష్మి, దళితులకు మూడెకరాల భూపంపిణీ తదితర పథకాలకు పెద్దపీట వేస్తూ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి సమస్య పరిష్కారం కాగా, గ్రామాల్లో ఎంతో వ్యయంతో రప్పించిన తాగునీటిని వృథా చేయవద్దని సూచించారు. గజ్వేల్ నుంచి సిఎం కెసిఆర ప్రాతినిత్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టం కాగా, సిఎంను ఆదరించి ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. రూ. వందలకోట్ల వ్యయంతో గజ్వేల్‌తోపాటు నియోజకవర్గంలో వివిద అభివృద్ధి పనులు జరుగుతుండగా, ప్రజల చైతన్యంతోనే పథకాలు, నిదులు సద్వినియోగమవుతాయని చెప్పారు. కాగా దర్మారెడ్డిపల్లి, అక్కారంలలో రెండేళ్ళ వ్యవదిలో రూ. 4కోట్లకు పైగా వెచ్చించి వివిద పథకాలు వర్తింపజేయగా, వాటర్‌ట్యాంకు, సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హన్మంతరావు, ఆర్డీఒ విజేందర్‌రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు వెంకటేశంగౌడ్, ఎంపిపి అధ్యక్షులు చిన్నమల్లయ్య, సర్పంచ్ రాజమ్మ, టిఆర్‌ఎస్ నేతలు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల దేవేందర్, బెండ మదు, నరేందర్‌రావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.